Google AI features: గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ పవర్డ్ ఫీచర్లు
ప్రస్తుతం ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా గూగుల్ లో సెర్చ్ చేయడం అందరికీ అలవాటు. గుండుసూది నుంచి అంతరిక్షం వరకూ అన్ని అంశాలు దానిలో ఉంటాయి. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచ మంతా దగ్గర ఉన్నట్టే. గూగుల్ కూడా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక అప్ డేట్లు చేస్తుంది. దీనిలో భాగంగా ఆండ్రాయిడ్ పరికరాల కోసం ఆర్టిఫీషియల్ పవర్డ్ ఫీచర్ల కొత్త సెట్ ను ప్రారంభించింది. ఆండ్రాయిడ్ 15 పరికరాలన్నింటికీ దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం కొత్త సెట్ ఏఐ ఫీచర్లు వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఆడియో క్యాప్షన్లు, ఇమేజ్ వివరణలు, కొత్త స్టిక్కర్ కాంబో తదితర వాటిని ప్రవేశపెట్టారు. అలాగే గూగుల్ ఫిక్సెల్ స్మార్ట్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా అదనపు ఫీచర్లను విడుదల చేశారు. ఇవన్ని రాబోయే కొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. గూగుల్ కొత్త ఏఐ ఫీచర్ల ప్రత్యేకతలను తెలుసుకుందాం.
గూగుల్ నయా ఏఐ ఫీచర్లు ఇవే
- ఎక్స్‌ప్రెసివ్ క్యాప్షన్ ఫీచర్ లో భాగంగా మీకు క్యాప్షన్ పంపిన వారి భావోద్వేగాన్ని తెలుసుకోవచ్చు. వాల్యూమ్,టోన్, పదాల కంటే శబ్దాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. క్యాప్షన్లలో గుసగుసలు, చీర్స్, చప్పట్లు అన్ని తెలుస్తాయి.
- అంధులు, తక్కువ కంటి చూపు ఉన్నవారి కోసం ఇమేజ్ క్యూఅండ్ఏ ఇన్ లుక్ అవుట్ అనే ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. మీ పరిసరాల గురించిన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ఈ యాప్ ద్వారా ఒక ఫొటోను తీసి అప్ లోడ్ చేయండి. దాని గురించి వివరాలు మీకు బిగ్గరగా పైకి చెబుతుంది.
- ఎమోజీ కిచెన్ అనే ఫీచర్ తో మీకు కావాల్సిన ఎమోజీలను రూపొందించుకునే వీలుంటుంది. దీని ద్వారా రెండు ఎమోజీలను కలిపి ఓ ప్రత్యేకమైన స్టిక్కర్ గా మార్చుకోవచ్చు. ఇది ఆపిల్ లోని జెన్మోజీని పోలి ఉంటుంది. కానీ అది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎమోజీ కిచెన్ మాత్రం అందరికీ అందుబాటులో ఉంది.
- క్యూఆర్ కోడ్ ఫీచర్ తో ఫొటోలు, వీడియోలు, పత్రాలను వేరొకరికి పంపడం మరింత సులభంగా, సురక్షితంగా ఉంటుంది. ముందుగా మీరు పంపాలనుకున్న మీడియా ఫైల్ ను ఎంపిక చేసుకోవాలి. క్యూాఆర్ కోడ్ ను నొక్కాలి. సురక్షిత బదిలీ కోసం ఇతరులను స్కాన్ చేయాలి.
- గూగుల్ డిస్క్ ఫీచర్ ద్వారా మెరుగైన స్కాన్ సేవలు పొందవచ్చు. రశీదులు, పత్రాలు, గుర్తింపు కార్డులను సరైన కాంట్రాస్ట్, వైట్ బ్యాలెన్స్ తో మాన్యువల్ ఎడిటింగ్ లేకుండా సేవ్ చేసుకోవచ్చు. వాటిని ఫొటో తీసిన వెంటనే ఈ ఫీచర్ ద్వారా డిజిటల్ వెర్షన్ లో సేవ్ అవుతాయి.
- మీకు ఇష్టమైన యాప్ లు, సేవలతో అనుసంధానం చేసుకునే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. మీ డిఫాల్డ్ ఫోన్, మెసేజింగ్ యాప్ ల ద్వారా సందేశాలు పంపవచ్చు. అలారం సెట్ చేసుకోవచ్చు. కెమెరాను కూడా ఆపరేట్ చేయవచ్చు. త్వరలో మీ గూగుల్ ఖాతాకు లింక్ చేసిన స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఫిక్సెల్ ఫోన్ వినియోగదారులందరూ ప్రత్యేకమైన కొత్త ఫీచర్లకు యాక్సెస్ పొందుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి