BSNL Plans: బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.49తో ప్రీపెయిడ్‌ ప్లాన్‌

|

Jul 19, 2022 | 3:55 PM

BSNL Plans: ప్రస్తుతం టెలికం కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు రకరకాల ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్..

BSNL Plans: బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.49తో ప్రీపెయిడ్‌ ప్లాన్‌
Bsnl Plans
Follow us on

BSNL Plans: ప్రస్తుతం టెలికం కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు రకరకాల ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ కంపెనీలు సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతుండగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా కొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు కస్టమర్లు తగ్గిపోతుండటంతో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు ఆ కస్టమర్లను తిరిగి తీసుకురావడానికి ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్ రూ.49 నుండి ప్రారంభమవుతుంది. తక్కువ మొబైల్ డేటా వాడే వారి కోసం ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

జియో, ఎయిర్‌టెల్ రెండూ ఇంతకుముందు వినియోగదారులకు రూ. 49 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందించేవి. కానీ ఇప్పుడు ఈ కంపెనీలు ఈ ప్లాన్‌ను నిలిపివేసాయి. అటువంటి పరిస్థితిలో ఎయిర్‌టెల్, జియో వినియోగదారులు రూ. 49 ప్లాన్‌ను ఉపయోగించలేరు. మీరు BSNL వినియోగదారు అయితే మీకు 49 రూపాయల చౌక ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో మీకు 3G ఇంటర్నెట్ సర్వీస్ లభిస్తుంది. త్వరలో BSNL కూడా ఈ ప్లాన్‌లో 4G సేవలను అందించనున్నట్లు తెలుస్తోంది.

రూ.49 ప్లాన్‌లో మీకు 100 నిమిషాల వాయిస్ కాలింగ్, 1GB మొబైల్ డేటా లభిస్తుంది. 20 రోజుల వాలిడిటీ అందుబాటులో ఉంటుంది. 49 కంటే తక్కువ చౌకైన ప్లాన్ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 29 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది కేవలం 5 రోజులు మాత్రమే చెల్లుబాటును అవుతుంది. అపరిమిత వాయిస్ కాల్‌లు, 1GB మొబైల్ డేటాను కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి