Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్ల వివరాలివే

|

Oct 25, 2022 | 6:57 AM

ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,010కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,290గా ఉంది.

Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్ల వివరాలివే
Gold Price Today
Follow us on

పసిడి ప్రియులకు కాస్త ఊరట. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. దీపావళి, ధన్‌తేరాస్‌ పండగలతో ఆకాశన్నంటిన పసిడి రేట్లు ఇవాళ (అక్టోబర్‌ 25)మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,010కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,290గా ఉంది. ఇక ఇవాళ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 57,700 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,720 వద్ద ఉంది.

☛ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 వద్ద ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,340 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,290 వద్ద ఉంది.

వెండి ధరలిలా..

ఇక వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,700 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.63,200 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.63,200 ఉండగా, చెన్నైలో రూ.63,200 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.57,700 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.63,200 ఉంది. ఇక కేరళలో రూ.63,200 వద్ద కొనసాగుతోంది. కాగా, దేశంలోని ఇతర నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..