Gold Silver Price Today: భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి ప్రత్యేక స్థానముంది. పసిడికి మహిళలో ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. సామాన్య జనాలు సైతం బంగారం కొనుగోలు చేయక మానరు. ఇక ఉన్నతమైన కుటుంబాలైతే బంగారం పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. అంత విలువైన బంగారం ప్రతిరోజు కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. దేశంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. తాజాగా ఆగస్టు 9న దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు:
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,870 ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ర.52,030 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.51,870 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 51,930 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద ఉంది.
వెండి ధరలు..
దేశంలో బంగారం బాటలోనే వెండి పనిస్తోంది. సిల్వర్ ధర స్థిరంగా కొనసాగుతోంది. ఎలాంటి మార్పులేదు. ఇక తాజాగా నమోదైన ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.63,000, ముంబైలో రూ.57,400, ఢిల్లీలో రూ.57,400, కోల్‌కతాలో రూ.57,400, బెంగళూరులో రూ63,000, కేరళలో రూ.63,000, హైదరాబాద్‌లో రూ.63,400, విజయవాడలో రూ.63,000, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.63,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి