AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు సడెన్‌గా ఎందుకు త​గ్గుతున్నాయి? దాని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే..!

రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద అవకాశాలు, అధిక లాభాల తర్వాత పెట్టుబడిదారులు విక్రయించడం ఈ పతనానికి కారణం. బంగారం రూ.12,500 వరకు తగ్గగా, రాబోయే రోజుల్లో మరింత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు సడెన్‌గా ఎందుకు త​గ్గుతున్నాయి? దాని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే..!
Gold And Silver
SN Pasha
|

Updated on: Oct 23, 2025 | 9:24 PM

Share

రికార్డు స్థాయిలో నిరంతరం పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు తగ్గడం ప్రారంభించాయి. ముఖ్యంగా వెండి ధర బాగా పెరిగింది, కానీ ఇప్పుడు తగ్గుతోంది. బంగారం ధర కూడా గరిష్ట స్థాయి నుండి తగ్గుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో న్యూయార్క్ బంగారు ఫ్యూచర్స్ దాదాపు 6 శాతం తగ్గాయి. భారతదేశంలో బంగారం ధర గ్రాముకు రూ.12,500కి తగ్గింది. సంవత్సరం ప్రారంభంలో ఉన్నదానికంటే బంగారం ఇప్పటికీ ఎక్కువగా ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ధర తగ్గుతూనే ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అనిశ్చిత ప్రపంచ వాణిజ్యం, రాజకీయ వాతావరణం. ఈ ధర తగ్గడానికి కారణం ఏమిటి?

బంగారం ధరలు తగ్గడానికి రెండు ప్రధాన కారణాలు

బంగారం, వెండి ధరలు తగ్గడానికి స్పష్టమైన కారణాలు లేవు. అయితే నిపుణులు మాత్రం ఓ రెండు రెండు ప్రధాన కారణాలను సూచించారు. ఒకటి.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది, ఇది ప్రపంచ వాణిజ్య వాతావరణాన్ని సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. రెండో ​కారణం బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు వాటిని అమ్ముతున్నారు. బంగారం, వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. సాధారణ సంవత్సరాల్లో వాటి ధరలు 10-12 శాతం మాత్రమే పెరుగుతాయి.

అయితే గత ఒక సంవత్సరంలో ధరలు 50-70 శాతం పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడిదారులు వాటిని విక్రయించి లాభం పొందడం సహజం. ఇప్పుడు కూడా అదే జరుగుతుండవచ్చు. సో డిమాండ్‌ తగ్గుతుంది. 2026లో బంగారం ధర 20 శాతం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధర మరింత తగ్గవచ్చు. ఆ తర్వాత దాని ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించవచ్చని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి