Gold Reserves: బంగారం నిల్వలున్న టాప్‌-20 దేశాలు.. భారత్‌ ఎన్నో స్థానం అంటే..

|

Jul 24, 2024 | 10:14 AM

దేశాలు బంగారం నిల్వలను ఎందుకు ఉంచుకుంటాయి? ఎందుకంటే బంగారం నిల్వలు ఒక దేశం ఆర్థిక స్థిరత్వానికి కీలకం. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో విశ్వసనీయమైన విలువ గల స్టోర్‌గా పనిచేస్తాయి. 1970లలో అధికారికంగా రద్దు చేయబడినప్పటికీ, అనేక దేశాలు బంగారు నిల్వలను నిర్వహిస్తాయి. పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి..

Gold Reserves: బంగారం నిల్వలున్న టాప్‌-20 దేశాలు.. భారత్‌ ఎన్నో స్థానం అంటే..
Gold Reserves
Follow us on

దేశాలు బంగారం నిల్వలను ఎందుకు ఉంచుకుంటాయి? ఎందుకంటే బంగారం నిల్వలు ఒక దేశం ఆర్థిక స్థిరత్వానికి కీలకం. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో విశ్వసనీయమైన విలువ గల స్టోర్‌గా పనిచేస్తాయి. 1970లలో అధికారికంగా రద్దు చేయబడినప్పటికీ, అనేక దేశాలు బంగారు నిల్వలను నిర్వహిస్తాయి. పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం నిల్వలకు డిమాండ్ పెరుగుతోంది. సెంట్రల్ బ్యాంక్‌లు మరోసారి బంగారానికి ప్రాధాన్యతనిచ్చే సురక్షిత ఆస్తిగా మొగ్గు చూపుతున్నాయి.

ఇందులో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న టాప్ 20 దేశాల గురించి తెలుసుకుందాం. దేశాలవారీగా బంగారు నిల్వల ర్యాంకింగ్‌ను పరిశీలిద్దాం.

బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏ సీజన్‌లో అయినా బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వినియోగదారులతో షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. బంగారం అనేది పెట్టుబడులో కీలక పాత్ర పోషిస్తుంటుంది. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయాల్లో విశ్వసనీయమైన విలువ నిల్వగా పనిచేస్తాయి. ఫోర్బ్స్ ప్రకారం, దేశాలు తమ కరెన్సీ, నిర్దిష్ట పరిమాణంలో బంగారం మధ్య స్థిరమైన మారకపు రేటును నిర్ణయించడం ద్వారా తమ కాగితం కరెన్సీ విలువను బంగారంతో ముడిపెట్టాయి . ముఖ్యంగా జారీ చేసిన ప్రతి యూనిట్ కరెన్సీ బంగారంలో సమానమైన విలువను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన టాప్ 20 దేశాల జాబితా:

  1. 1వ స్థానంలో USA ప్రపంచంలో అత్యధికంగా 8,1336.46 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి.
  2. 2వ స్థానంలో జర్మనీ ఉంది. ఇక్కడ 3,352.65 టన్నుల బంగారం నిల్వలున్నాయి.
  3. 3వ స్థానంలో ఇటలీ ఉంది. ఇక్కడ 2,451.84 టన్నుల బంగారం నిల్వలున్నాయి.
  4. 4వ స్థానంలో ఫ్రాన్స్‌. ఇక్కడ 2,436.88 టన్నుల బంగారం నిల్వల ఉన్నాయి.
  5. 5వ స్థానంలో రష్యా. ఇక్కడ 2,332.74 టన్నుల బంగారం నిల్వలు.
  6. 6వ స్థానంలో చైనా ఉంది. ఇక్కడ 2,262.45 టన్నుల బంగారం నిల్వలు
  7. 7వ స్థానంలో స్విట్జర్లాండ్‌ ఉంది. ఇక్కడ 1,040.00 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి
  8. 8వ స్థానంలో జపాన్‌. ఇక్కడ 845.97 టన్నుల బంగారం నిల్వలు.
  9. 9వ స్థానంలో భారత్‌ ఉంది. మన దేశంలో 822.09 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
  10. 10వ స్థానంలో నెదర్లాండ్స్‌. ఇక్కడ 612.45 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
  11. 11వ స్థానంలో టోక్యో. ఇక్కడ 570.30 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
  12. 12వ స్థానంలో తైవాన్‌ ఉంది. ఇక్కడ 423.63 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
  13. 13వ స్థానంలో పోర్చుగల్‌. ఇక్కడ 382.63 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
  14. 14వ స్థానంలో పోలాండ్‌ ఉంది. ఇక్కడ 359.89 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
  15. 15వ స్థానంలో ఉబ్బెకిస్థాన్‌. ఇక్కడ 357.69 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
  16. 16వ స్థానంలో సౌదీ ఆరేబియా ఉంది. ఇక్కడ 323.07 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
  17. 17వ స్థానంలో ఖాజాకిస్థాన్‌ ఉంది. ఇక్కడ 310.62 టన్నుల గోల్డ్‌ నిల్వలున్నాయి.
  18. 18వ స్థానంలో యూనైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK) ఉంది. ఇక్కడ 310.29 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
  19. 19వ స్థానంలో లెబనాన్‌ ఉంది. ఇక్కడ 286.83 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
  20. 20వ స్థానంలో స్పెయిన్‌ ఉంది. ఇక్కడ 281.58 టన్నుల బంగారం నిల్వలున్నాయి.

దేశాలు బంగారం నిల్వలను నిర్వహించడానికి ఒకటి కాదు, అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదట బంగారం ఒక స్థిరమైన, ఆధారపడే విలువ గల స్టోర్‌గా గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో బంగారాన్ని నిల్వ చేయడం ద్వారా దేశాలు తమ ఆర్థిక స్థిరత్వంపై విశ్వాసాన్ని కలిగిస్తాయి.

అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశాలు ఏవి?

అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న మొదటి 3 దేశాలలో యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఇటలీ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ అత్యధిక బంగారు నిల్వలను కలిగి ఉంది. అలాగే జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉన్న తదుపరి మూడు దేశాలలో కలిపి మొత్తంగా దాదాపుగా ఎక్కువ నిల్వలను కలిగి ఉంది.

బంగారు నిల్వలలో భారతదేశం ర్యాంకింగ్ ఏమిటి?

గ్లోబల్ గోల్డ్ రిజర్వ్‌లలో భారతదేశం గణనీయమైన స్థానాన్ని కలిగి ఉంది. అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితాలో భారత్‌ 9వ స్థానంలో ఉంది. బంగారం పట్ల గొప్ప సాంస్కృతిక అనుబంధం, బంగారం చరిత్ర సంప్రదాయ విలువలు, భారతదేశం బంగారు నిల్వలు దాని ఆర్థిక స్థిరత్వానికి దోహదపడతాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో బంగారం కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: School Holiday: సంచలన నిర్ణయం.. వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి