AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: దీపావళికి ముందురోజే భారీ ఊరట.. బంగారం ధరలు మళ్లీ పతనం.. నవంబర్ 7న తులం ఎంతంటే..?

గోల్డ్ రేట్లు భారీగా పడిపోతున్నాయి. సోమవారం నుంచి గురువారం వరకు ధరలు పెరగ్గా.. శుక్రవారం నుంచి కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు గోల్డ్ రేట్లలో తగ్గుదలకు కారణమవుతోంది. దీపావళికి ముందే ధరలు పతనమవ్వడం పెద్ద ఊరటగా చెప్పవచ్చు. శనివారం రోజున ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: దీపావళికి ముందురోజే భారీ ఊరట.. బంగారం ధరలు మళ్లీ పతనం.. నవంబర్ 7న తులం ఎంతంటే..?
Gold
Venkatrao Lella
|

Updated on: Nov 07, 2026 | 6:39 AM

Share

దీపావళి పండక్కి ముందురోజే పసిడి ధరలు పతనమయ్యాయి. ధంతేరస్ సందర్బంగా నవంబర్ 6వ తేదీన శుక్రవారం గోల్డ్ రేట్లు పడిపోగా.. శనివారం కూడా అదే తగ్గుదల కొనసాగింది. దీపావళికి ముందు రోజే ఇవాళ కూడా గోల్డ్ రేట్లు క్రాష్ అయ్యాయి. పండుగ వేళ ధరలు పడిపోవడం పెద్ద ఊరటగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా పరిణామాల్లో మార్పుల వల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ భారీ ఓటమి తర్వాత అంతర్జాతీయంగా పరిణామాలు మారుతున్నాయి.  ఇరాన్‌తో యుద్దాన్ని ట్రంప్ ముగిసే అవకాశముందని, శాంతి ఒఫ్పందం దిశగా అడుగులు పడొచ్చనే వార్తలు బలపడుతున్నాయి. దీంతో ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా మరింత మెరుగుపడనుంది. దీని వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కారణంతో పసిడి ధరల్లో భారీ ఒడిదొడుకులు నమోదవుతున్నాయి. నవంబర్ 7వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..

– దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,490గా ట్రేడవుతోంది.

-హైదరాబాద్ బహిరంగ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,450 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,490 వద్ద ట్రేడవుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450 పలుకుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,490 వద్ద కొనసాగుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,600కు లభిస్తోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,640 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450గా ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,490కు లభిస్తోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,450 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,490గా కొనసాగుతోంది.

వెండి ధరలు ఇవే..

-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,04,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.2,05,000 వద్ద స్థిరపడింది

-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2,04,900 వద్ద ట్రేడవుతోంది

-చెన్నైలో కేజీ వెండి ధర రూ..2,04,900 పలుకుతోంది.

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ..2,04,900 వద్ద కొనసాగుతోంది

Follow Us
అరంగేట్రం చేసిన రోజే వీడ్కోలు చెప్పిన టీమిండియా స్టార్ ప్లేయర్..!
అరంగేట్రం చేసిన రోజే వీడ్కోలు చెప్పిన టీమిండియా స్టార్ ప్లేయర్..!
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. దరఖాస్తు లింక్
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. దరఖాస్తు లింక్
దీపావళికి ముందు రోజే బంగారం ధరలు భారీ పతనం.. తులం ఎంతంటే..?
దీపావళికి ముందు రోజే బంగారం ధరలు భారీ పతనం.. తులం ఎంతంటే..?
చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు పునాది.. అద్భుతమైన పాఠం!
చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు పునాది.. అద్భుతమైన పాఠం!
ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు విషాదం.. MPTC అభ్యర్థి మృతి!
ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు విషాదం.. MPTC అభ్యర్థి మృతి!
ప్రాణాలతో పోరాడుతున్న పిల్లు ఏనుగు ‘మాయ’ కథ..!
ప్రాణాలతో పోరాడుతున్న పిల్లు ఏనుగు ‘మాయ’ కథ..!
ఒకే కొబ్బరికాయను ముక్కలు చేయకుండా ఏడుగురికి సమానంగా ఎలా పంచాలి?
ఒకే కొబ్బరికాయను ముక్కలు చేయకుండా ఏడుగురికి సమానంగా ఎలా పంచాలి?
నవంబర్ 7 రాశిఫలాలు: ఈ రోజు వారికి అన్నీ శుభాలే..
నవంబర్ 7 రాశిఫలాలు: ఈ రోజు వారికి అన్నీ శుభాలే..
అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా ఇళ్లకు వెలుగులు
అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా ఇళ్లకు వెలుగులు
41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. చివరికి.. !
41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. చివరికి.. !