AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు విషాదం.. MPTC అభ్యర్థి గుండెపోటుతో మృతి!

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (28) గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆమె ఆకస్మిక మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు..

ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు విషాదం.. MPTC అభ్యర్థి గుండెపోటుతో మృతి!
Janasena MPTC Candidate Garapati Divya Death
Srilakshmi C
|

Updated on: Nov 07, 2026 | 6:06 AM

Share

తూర్పుగోదావరి, నవంబర్‌ 7: ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (28) శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్న నేపథ్యంలో, ఫలితాలకు ఒక్కరోజు ముందే ఆమె మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

శుక్రవారం దివ్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు వెల్లడించారు. కూటమి తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దివ్య.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎంతో కష్టపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నికల కోసం ఎంతో శ్రమించిన ఆమె.. ఫలితం చూసుకోకుండానే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ విషయం తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దివ్య మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణ సాయంగా దివ్య కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అభ్యర్థి దివ్య మృతి చెందడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Follow Us
ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు విషాదం.. MPTC అభ్యర్థి మృతి!
ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు విషాదం.. MPTC అభ్యర్థి మృతి!
ప్రాణాలతో పోరాడుతున్న పిల్లు ఏనుగు ‘మాయ’ కథ..!
ప్రాణాలతో పోరాడుతున్న పిల్లు ఏనుగు ‘మాయ’ కథ..!
ఒకే కొబ్బరికాయను ముక్కలు చేయకుండా ఏడుగురికి సమానంగా ఎలా పంచాలి?
ఒకే కొబ్బరికాయను ముక్కలు చేయకుండా ఏడుగురికి సమానంగా ఎలా పంచాలి?
నవంబర్ 7 రాశిఫలాలు: ఈ రోజు వారికి అన్నీ శుభాలే..
నవంబర్ 7 రాశిఫలాలు: ఈ రోజు వారికి అన్నీ శుభాలే..
అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా ఇళ్లకు వెలుగులు
అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా ఇళ్లకు వెలుగులు
41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. చివరికి.. !
41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. చివరికి.. !
బషీర్ బలూచ్‌ పై విష ప్రయోగం? మిస్టరీగా BLA చీఫ్ ఆచూకీ
బషీర్ బలూచ్‌ పై విష ప్రయోగం? మిస్టరీగా BLA చీఫ్ ఆచూకీ
పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!
పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్