Gold, Silver Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. ఇవాళ (మే13) బులియన్ మార్కెడ్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాములు ధరపై ఏకంగా రూ.400 వరకు తగ్గగా, అదే 24 క్యారెట్ల బంగారంపై రూ. 440 వరకు తగ్గింది. శనివారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,550 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,690 గా ఉంది. ఇక వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండిపై రూ.2600 తగ్గడం గమనార్హం. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.75,000 పలుకుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,690 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ56,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690 పలుకుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,550గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,690 పలుకుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,840 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690 పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,240గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61, 690 పలుకుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,740 లుగా ఉంది.
ఇవాళ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర రూ.75,000 పలుకుతోంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 78, 700లకు లభిస్తోంది. చెన్నైలో మాత్రం 82,000 వేవల వద్ద ట్రేడ్ అవుతోంది.