Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

|

Apr 19, 2023 | 6:11 AM

Gold Price Today:బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో ఆకాశన్నంటిన పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. శనివారం (ఏప్రిల్‌ 8) ఉదయం..

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?
మహిళలకు ఈ పరిమితులు.. పేపర్లు లేకుండా మహిళలు తమ వద్ద ఉంచుకునే బంగారంపై పరిమితులున్నాయి. పెళ్లయిన ఒక మహిళ వద్ద 500 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు ఉండొచ్చు. అదే పెళ్లికాని మహిళలు అయితే పేపర్లు లేకుండా 250 గ్రాముల వరకు తమ వద్ద ఉంచుకోవచ్చు.
Follow us on

Gold Price Today:బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో ఆకాశన్నంటిన పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. శనివారం (ఏప్రిల్‌ 8) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,800లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,870 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 మేర తగ్గింది. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. ఇక బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర కూడా రూ.110 మేర పెరిగి రూ.76,460 వద్ద కొనసాగుతోంది. మరి మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55, 800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,870 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 పలుకుతోంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 లుగా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఇవి కూడా చదవండి
  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,020గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 పలుకుతోంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,530కు లభిస్తోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60, 920కు లభిస్తోంది.

వెండి ధరలిలా..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,600 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.76,600
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200
  • బెంగళూరులో రూ.80,200
  • కేరళలో రూ.80,200
  • కోల్‌కతాలో రూ.76,600
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200
  • విజయవాడలో రూ.80,200
  • విశాఖపట్నంలో రూ.80,200 లు పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..