Gold: బంగారంపై కేంద్ర బ్యాంకులు మోజు.. భారత్ బంగారం ఎన్ని టన్నులో తెల్సా.?

ఇంటనే ఉండగ బంగారం ఎందుకు నికా విచారం...ఇప్పుడిదే స్లోగన్ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. .మామూలుగా ఏదైనా వస్తువు రేటు ఎందుకు పెరుగుద్ది..డిమాండ్‌ పెరిగినప్పుడు..సప్లై ఆగినప్పుడు...లేక సిండికేట్ ఏకమై సరుకును అట్టిపెట్టినప్పుడు. ఇప్పుడిదే సిట్చువేషన్ మున్ముందు రావొచ్చన్న చర్చ వరల్డ్ వైడ్‌గా సాగుతోంది.

Gold: బంగారంపై కేంద్ర బ్యాంకులు మోజు.. భారత్ బంగారం ఎన్ని టన్నులో తెల్సా.?
Virtual Gold
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 06, 2024 | 8:45 PM

బంగారం.. బంగారమే బ్రదరూ. దానికి మించిన విలువైన ఖనిజాలున్నాయి. అయినా బంగారానికి మించిన క్రేజులేదు. బంగారానికున్నంత డిమాండ్ లేదు. ఎందుకంటే..గోల్డ్….ఎనీ సెంటర్..ఎనీ కంట్రీ..24బై సెవెన్ అమ్మబుల్…కొనబుల్…అన్నింటికి మించి ట్రస్ట్‌ఫుల్. నీ రూపాయి నీదేశంలోనే చెల్లుద్ది. డాలరైనా సరే మరో దేశంలో మార్చుకోవాలంటే కిందా మీదా పడాలి. కానీ బంగారం ఏదేశంలోనైనా సేలబుల్. అందుకే ఇప్పుడు ప్రపంచదేశాలు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. ప్రైవేట్ సంస్థలే కాదు. సెంట్రల్‌ బ్యాంకులు కూడా గోల్డ్‌ రిజర్వ్స్‌లు పెంచుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అక్టోబర్ నెలలో కేంద్ర బ్యాంకులు రికార్డ్ స్థాయిలో 60 టన్నుల బంగారం కొన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ WGC ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఒక నెలలో ఇంత భారీ స్థాయిలో బంగారం కొనడం ఇదే తొలిసారి. ఇందులో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే ఏకంగా 27 టన్నులు బంగారం కొనుగోలు చేయడం ప్రత్యేకమని పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో టర్కీ 17 టన్నుల బంగారం కొనుగోలు చేయగా.. పోలెండ్ 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. పోలెండ్ లాంటి దేశం కూడా బంగారంపై ఇన్వెస్ట్‌కు ఇంట్రస్ట్ చూపిస్తోంది. ఈమధ్యకాలంలోనే పోలండ్ 100టన్నుల బంగారం కొనుగోలు చేసింది.

ఈఏడాదిలోనే సెంట్రల్ బ్యాంకులు 694 టన్నుల బంగారాన్ని కొన్నాయని డబ్ల్యూజీసీ నివేదిక చెబుతోంది. అందులో మన ఆర్బీఐ ఒక్కటే 77 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత టర్కీ 72 టన్నులు, పోలెండ్ 69 టన్నుల బంగారం కొన్నాయి. 2024లో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల్లో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ టర్నీ, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా టాప్‌లో ఉన్నాయి. గత సెప్టెంబర్ నెల చివరి నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వల్లో 60 శాతం అంటే 510.46 టన్నుల బంగారం దేశీయంగా నిల్వ ఉంది. మార్చి నెలతో పోలిస్తే ఈ పరిమాణం ఏకంగా 102 టన్నులు పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ వద్ద ఉన్న నిల్వలను ఇటీవలే మన దేశానికి తరలించింది ఆర్‌బీఐ. దీంతో దేశీయ నిల్వలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మార్చి నెలతో పోలిస్తే రిజర్వ్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు ఏకంగా 38 శాతం మేర పెరిగాయి.

ఇక విదేశాల్లో కూడా భారత్ గోల్డ్ నిల్వల్ని పెంచుతూ వస్తోంది. విదేశాల్లో కూడా ఉంచిన నిల్వలతో కలిపి మొత్తం 854.73 టన్నులుగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం తులం బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 80 వేలు పలుకుతోంది. కేజీ 80 లక్షల రూపాయలు. ఒక టన్ను బంగారం దాదాపు 6కోట్ల80 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. బంగారం నిల్వల్లో అమెరికా టాప్‌ప్లేస్‌లో ఉంది. అమెరికా తర్వాత జర్మనీ, ఇటలీ ఫ్రాన్స్ ఉండగా…మన దేశం 8వ స్థానంలో ఉంది. అమెరికా దగ్గర 8వేల133టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి.

దేశం బంగారం(టన్నుల్లో)

అమెరికా –  8133 జర్మనీ – 3352 ఇటలీ – 2452 ఫ్రాన్స్ – 2437 రష్యా – 2336 చైనా – 2264 స్విట్జర్లాండ్ – 1040 ఇండియా – 854 జపాన్ – 846

ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మనదేశం టాప్‌10లో ఉంది. ఇది కేవలం ప్రభుత్వం దగ్గరున్న లెక్కల ప్రకారంగా చూస్తే. కానీ మన ఇండియాలో ఉన్నంత బంగారం ప్రపంచదేశాల్లో ఎక్కడాలేదు. బంగారమంటే అత్యంత క్రేజున్న దేశం మన దేశమే. మనకు పండగొచ్చినా, పెళ్లిళ్లు చేసినా,..పార్టీలు జరిగినా అందులో బంగారం తప్పనిసరిగా ఉండాలి. అందరికీ బంగారం జస్ట్ అవసరమే కానీ అత్యవసరం కాదు. కానీ మనకు మాత్రం అత్యవసరం.ఇంకా చెప్పాలంటే నిత్యావసరం. భారతీయుల నరనరాన ఇంకిపోయిన సింగారం ..బంగారం. అందుకే గోల్డ్ ప్రభుత్వబ్యాంకుల్లో కంటే..రిజర్వ్ బ్యాంకుల్లో ఉన్నదానికంటే 25రెట్ల బంగారం మన భారతీయ కుటుంబాల్లో ఉంది. ఆక్స్‌ఫర్డ్ గోల్డ్ గ్రూప్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న బంగారంలో 11శాతం భారతీయు కుటుంబాల్లోనే ఉంది. దాదాపు 25వేల టన్నులు..అంటే కిలోల్లో 22కోట్ల 67లక్షల 9వేల 618కిలోల బంగారంప్రజల దగ్గరే ఉంది. ఒక కిలో 84లక్షలనుకుంటే…కేవలం బంగారం రూపంలో మనోళ్ల దగ్గర ఎన్నికోట్ల డబ్బుందో లెక్కేసుకోండి. 2020-21 వరకు మన ఇండియన్స్ దగ్గర 13వేల టన్నుల బంగారం ఉంటే…కేవలం పదేళ్లలో అది రెట్టింపయ్యింది.

చాలా దేశాలు.. విదేశీ మారకపు నిల్వలు పెంచుకొని.. సామర్థ్యం పెంచుకునేందుకు ఇలా బంగారం నిల్వల్ని పెంచుకుంటుంటాయి. పొరుగు దేశం చైనా కూడా విపరీతంగా గోల్డ్ కొనుగోలు చేస్తుంటుంది. 2022లో కేంద్ర బ్యాంకులు అత్యధికంగా బంగారం కొన్నాయి. అప్పట్లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టడమే ఇందుకు కారణం. ఆ తర్వాత కొనుగోళ్లు తగ్గాయి. కానీ, ఇప్పుడు మళ్లీ భారీగా బంగారం నిల్వలు పెంచుకునేందుకు సెంట్రల్ బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. వివిధ దేశాల మధ్య యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను పరిగణనలోకి తీసుకుని రిస్క్ తగ్గించుకునేందుకే బంగారం నిల్వల పెంపు వ్యూహాన్ని కేంద్ర బ్యాంకులు అవలంభిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మామూలుగా బంగారాన్ని లండన్, న్యూయార్క్ వంటి ఆర్థిక కేంద్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ బాండ్లు నుంచి కొంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2650డాలర్ల దరిదాపుల్లో ఉంది. వచ్చే ఏడాదికి ఇది 3వేల డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. వినియోగదారుల నుంచి ఉన్న డిమాండ్‌కు తోడు కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పోటీ పడి కొనుగోలు చేస్తుండడంతో ఇప్పట్లో ధర తగ్గకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు చేయవద్దు.. భారీ నష్టం కలుగుతుంది..
మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు చేయవద్దు.. భారీ నష్టం కలుగుతుంది..
ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి ఇన్ని ఉపయోగాలా?
ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి ఇన్ని ఉపయోగాలా?
ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
వాస్తు పరంగా మీ ఇళ్లు ఇలా ఉంటే ఆర్థికంగా ఢోకా ఉండదు..!
వాస్తు పరంగా మీ ఇళ్లు ఇలా ఉంటే ఆర్థికంగా ఢోకా ఉండదు..!
నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది..
నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది..
కొత్త బడ్జెట్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం.. నిపుణుల విశ్లేషణలివే
కొత్త బడ్జెట్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం.. నిపుణుల విశ్లేషణలివే
మహాకుంభకు వెళ్తున్నారా మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ లిస్టు ఇదిగో
మహాకుంభకు వెళ్తున్నారా మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ లిస్టు ఇదిగో