AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Prices: వెండి ధరలపై బిగ్ న్యూస్.. భారీగా పడిపోతున్న రేట్లు.. మరింత తగ్గుతాయా..?

దేశంలో సిల్వర్ ధరలు భారీగా పడపోయాయి. గత 9 వారాల్లో భారీగా పతనమైంది. దాదాపు 42 శాతం మేర ధరలు కుప్పకూలాయి. బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతూ ఉంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి వెండి ధరలు ప్రభావితం అవుతూ ఉంటాయి.

Silver Prices: వెండి ధరలపై బిగ్ న్యూస్.. భారీగా పడిపోతున్న రేట్లు.. మరింత తగ్గుతాయా..?
Gold And Silver
Venkatrao Lella
|

Updated on: Apr 05, 2026 | 2:19 PM

Share

దేశంలో బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ వారంలో భారీగా పెరగ్గా.. ఆదివారం తగ్గుముఖం పట్టాయి. సోమవారం నుంచి ధరలు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. ఈ వారంలో గోల్డ్ రేట్లు రూ.3 వేల మేర పెరిగాయి. ఇక సిల్వర్ రేట్లు చూస్తే గత 8 వారాల్లో 42 శాతం మేర కుప్పకూలాయి. గోల్డ్‌తో పోలిస్తే వెండి ధరలు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. గత కొద్ది నెలల క్రితం కిలో వెండి ఏకంగా రూ.4 లక్షలకు చేరి జీవితకాలపు గరిష్ట స్థాయికి తాకింది. ఆ తర్వాత నుంచి ధరలు పడిపోతూ వస్తోన్నాయి. ఇప్పుడు ఏకంగా రూ.1.70 లక్షలకు డౌన్ అయ్యాయి. బంగారంతో పోలిస్తే వెండి ధరలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో ఎక్కువగా ముడిపడి ఉంటాయి. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ఎలక్ట్రిక్ సిస్టమ్స్, సోలార్ ప్యానెల్ సెల్స్ వంటి వాటిల్లో వెండికి డిమాడ్ ఉంది.

అప్పుడే వెండికి డిమాండ్

ఆర్ధిక వ్యవస్థలు పుంజుకున్నప్పుడు వెండికి డిమాండ్ పెరిగే అవకాశముంటుంది. గత రెండు రోజులుగా సిల్వర్ రేట్లు స్ధిరంగా ఉండగా.. వీటి ధరలు తగ్గడంతో పెట్టుబడిదారులు ఊరట చెందుతున్నారు. గత వారం రోజుల్లో వెండి రూ.10 వేలు తగ్గింది. బంగారంతో పోలిస్తే వెండిలో అస్థిరత రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు దీనిని అవకాశంగా చూసుకుని పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను నిర్వహించేటప్పుడు అస్థిరత సవాల్‌గా మారవచ్చు. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2.55 లక్షలుగా ఉంది. ఇక ఢిల్లీలో రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు గోల్డ్ రేట్లు చూస్తే.. హైదరాబాద్‌లో తులం బంగారం రూ. 1,51,080గా ఉంది.

Follow Us