Gold Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ లక్షా 30 వేలు దాటేసింది!
Gold Price Today: బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా..

Gold Price Today: బంగారం, వెండి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. స్వల్పంగా తగ్గుముఖం పట్టి మరుసటి రోజే అంతకు రెట్టింపుగా దూసుకెళ్తోంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చేశాయి. తాజాగా తులం బంగారం ధర లక్షా 30 వేల రూపాయలు దాటేసింది. తాజాగా డిసెంబర్ 12న తులం బంగారం ధర రూ.1,30,760 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర అదే రోజు కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,01,100 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యన బంగారం ధరలను అప్‌డేట్ చేస్తారు. అప్పుడు మార్పు ఉండవచ్చని గమనించండి.
Success Story: చదివింది 6వ తరగతి.. వినూత్న ఆలోచనలో అద్భుతమైన వ్యాపారం!
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,910 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,20,100 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,760 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,860 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,760 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,860 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,760 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,860 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,760 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,860 వద్ద కొనసాగుతోంది.
బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం ఏమిటి?
బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు. ఫలితంగా, వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
School Holidays: విద్యార్థులకు ఇది కదా కావాల్సింది.. వరుసగా 6 రోజులు పాఠశాలలకు సెలవులు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




