AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. కొనుగోలు చేసేవారికే బ్యాడ్ న్యూస్.. తులం ఎంతంటే..?

బంగారం ధరలు గత కొంతకాలంగా పడిపోతూ వస్తోండగా.. ఈ వారం నుంచి మాత్రం పెరుగుతున్నాయి. దీపావళి వస్తున్న వేళ బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీని వల్ల గోల్డ్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు ఎగబాకుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి.

Gold Prices: దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. కొనుగోలు చేసేవారికే బ్యాడ్ న్యూస్.. తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Oct 27, 2026 | 6:38 AM

Share

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీపావళి పండుగ రానున్న క్రమంలో పసిడికి బాగా డిమాండ్ పెరుగుతోంది. పండుగ కారణంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీని వల్ల డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు అమాంతం పుంజుకుంటున్నాయి. దీని వల్ల కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల క్రమంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. అక్టోబర్ 27వ తేదీన దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

ఇవాల్టీ బంగారం ధరలు ఇవే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,42,760 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,860గా ట్రేడవుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,42,760గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,860 వద్ద కొనసాగుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 4 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,010 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,760 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,860గా ట్రేడవుతోంది.

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,42,760 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,860గా ట్రేడవుతోంది.

వెండి ధరలు ఇలా..

-చెన్నైలో కిలో వెండి ధర రూ.2,19,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.20 లక్షలుగా ఉంది.

-బెంగళూరులో కేజీ సిల్వర్ రేటు రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది

-దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?

దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తూ నిల్వలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణమవుతోన్నట్లు ఆర్ధిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us