
గోల్డ్ లవర్స్‌కి ఇది నిజంగానే గోల్డెన్ న్యూస్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. గడిచిన మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బంగారం ప్రియులు కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. శనివారం మరోసారి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 10 తగ్గి రూ. 66,690కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 తగ్గి రూ. 72,750కి చేరింది. ఈ తగ్గుదల స్వల్పమే అయినా ప్రస్తుతం గోల్డ్ ప్రైజ్ ఆల్ టైమ్ హైకి చేరుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి తులం బంగారం ధర రూ. 80 వేలకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరి దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,840కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,900 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,750గా ఉంది.
ఇవి కూడా చదవండి* ఇక చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 67,290కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410 వద్ద కొనసాగుతోంది.
ఇది చదవండి: పొలం పనుల్లో చేస్తుండగా గడ్డపారకు తగిలిన రాతిడబ్బా.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,690కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,690గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.
వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశవ్యాప్తంగా మంగళవారం వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 95,400 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా హైదరాబాద్‌తోపాటు విశాఖ, విజయవాడ, కేరళలలో కిలో వెండి ధర రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.
ఇది చదవండి: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..