AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!

Gold Price Today: దసరా, దీపావళి, పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. ఈ సెంటిమెంట్ కారణంగా.. భారతదేశంలో బంగారం

Gold Price Today: మహిళలకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!
uppula Raju
|

Updated on: Oct 06, 2021 | 6:11 AM

Share

Gold Price Today: దసరా, దీపావళి, పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. ఈ సెంటిమెంట్ కారణంగా.. భారతదేశంలో బంగారం కొనుగోళ్లు జోరుగా పెరుగుతాయి. భారత్‌లో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా బుధవారం (అక్టోబర్‌ 6) దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 నుంచి 400 వరకు పెరిగింది. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో బుధవారం ధరల వివరాలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,080 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,060 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,680 ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,850 ఉంది.

అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,730 ఉంది.

పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

High Court Judges: దేశ వ్యాప్తంగా 15 మంది హైకోర్టు జడ్జిల బదిలీ.. ఏపీకి ఇద్దరు, తెలంగాణకు ఒక్కరు

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SSC CGL 2026లో 12 వేలకుపైగా ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SSC CGL 2026లో 12 వేలకుపైగా ఉద్యోగాలు
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..