Gold Price Today: తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంతో తెలుసా..?
Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అందుకే గోల్డ్ ధరలు స్థిరంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. జూలై 7న దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప మార్పు ఉంది. పన్ను, ఎక్సైజ్ సుంకం కారణంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. బంగారం ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి తులం బంగారం ధరపై అతి స్వల్పంగా తగ్గింది. ఈ ధరలు రోజులో తగ్గవచ్చు, పెరగవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,820 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 90,590 రూపాయల వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,820 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 90,590 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,970 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల ధర 90,740 వద్ద కొనసాగుతోంది.
ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,820 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 90,590 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,820 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 90,590 రూపాయల వద్ద ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,820 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 90,590 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,820 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల ధర 90,590 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే.. ఇది కూడా అతి స్వల్పంగానే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా 9,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి