Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఇవే

|

Dec 08, 2024 | 7:05 AM

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గిన పసిడి ధర మళ్లీ పైపైకి ఎగబాకుతోంది. మరి ఆదివారం (డిసెంబర్ 08) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఇవే
Gold And Silver Price
Follow us on

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు తగ్గితే మరొక రోజు ఆకాశానికంటుతున్నాయి. అయితే ఆదివారం (డిసెంబర్ 08) మాత్రం పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. చాలా నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతోన్న పసిడి ధరలు ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయంటే బంగారం కొనేవారికి గుడ్ న్యూసే అని చెప్పవచ్చు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,620 ఉంది. ఇదే క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,150కి చేరింది. దాదాపు ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన , విశాఖ పట్నం, విజయవాడ, పొద్దుటూరు, వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 71,300 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 77,770 ఉంది.
  • చెన్నై లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 77, 620 ఉంది.
  • ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,1450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 7 7, 620 ఉంది.
  • బెంగళూరు లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.71,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 7 7620 గా ఉంది.

మధురై, కోయంబత్తూరు వంటి ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. శనివారం నాటి ధరలతో పోల్చుకుంటే ఆదివారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. . ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబైలో కిలో వెండి రూ. 92,000గా ఉంది. అలాగే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కేరళ తదితర నగరాల్లో కిలో వెండి రూ. 1,00,000 గా ఉంది. కాగా, ఈ ధరలు ఆదివారం ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కొనే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..