Gold Price Today: పండగ వేళ పసిడి కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Aug 16, 2024 | 7:24 AM

పసిడి ప్రియులకు మళ్లీ గోల్డ్‌ షాక్‌ ప్రారంభమైంది. బడ్జెట్‌లో బంగారం, వెండి లోహాలపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో వారం క్రితం వరకూ ధరలు కాస్త దిగొచ్చాయి. కేవలం వారం రోజుల్లోనే రూ.7 వేల వరకు ధరలు పతనమయ్యాయి. అయితే ప్రస్తుతం మాత్రం మళ్లీ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జులైలో దేశ పసిడి..

Gold Price Today: పండగ వేళ పసిడి కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 16: పసిడి ప్రియులకు మళ్లీ గోల్డ్‌ షాక్‌ ప్రారంభమైంది. బడ్జెట్‌లో బంగారం, వెండి లోహాలపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో వారం క్రితం వరకూ ధరలు కాస్త దిగొచ్చాయి. కేవలం వారం రోజుల్లోనే రూ.7 వేల వరకు ధరలు పతనమయ్యాయి. అయితే ప్రస్తుతం మాత్రం మళ్లీ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జులైలో దేశ పసిడి దిగుమతులు 4.23 శాతం తగ్గింది. బంగారం అధిక ధరల నేపథ్యంలోనే దిగుమతులు తగ్గినట్లు వ్యాపారులు అంటున్నారు. పండగ సీజను ప్రారంభం కానుండటం, దిగుమతి సుంకం తగ్గింపు వల్ల సెప్టెంబరు నుంచి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని ఆభరణాల వర్తకులు అంటున్నారు.

ఇక ఆగస్టు 16 (శుక్రవారం) నాటి పసిడి ధరల విషయానికొస్తే.. ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారంతో పోల్చితే ఈ రోజు గ్రాముకు రూపాయి చొప్పున తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.7,150 వద్ద, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.6,554 వద్ద, 18 క్యారెంట్ల బంగారం రూ.5,362 వద్ద కొనసాగుతున్నాయి. ఆ లెక్కన 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) బుధవారం రూ. 65,550 ఉండగా.. నేడు రూ.10 తగ్గి రూ.65,540 ధర పలుకుతోంది. అలాగే 22 క్యారెంట్ల తులం ధర రూ.71,500గా ఉంది. 18 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ.53,620 వద్ద కొనసాగుతుంది.

దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.71,500 వద్ద ఉంది. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,620 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,500 ఉంది. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,620 వద్ద ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.71,500 ఉండగా, 18 క్యారెట్ల తులం ధర రూ.53,620గా ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,650 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం ధర రూ.53,750గా ఉంది.
  • గుంటూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం ధర రూ.53,620గా ఉంది.
  • కలకత్తాలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం ధర రూ.53,620గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500 వద్ద ఉంది. 18 క్యారెట్ల తులం ధర రూ.53,620గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం ధర రూ.53,620గా ఉంది.

ఇక వెండి ధరలు కూడా దాదాపు స్థిరంగా ఉన్నట్లే. కిలో వెండి రూ.83,400. బుధవారంతో పోల్చితే కిలోకి రూ.100 తగ్గింది. బుధవారం కేజీ వెండి ధర రూ.83,500 ఉండగా.. ఈ రోజు రూ.83,400గా ఉంది. చెన్నైలో రూ.88,600, హైదరాబాద్‌లో రూ.88,600, బెంగళూరులో రూ.79,900లుగా ఉంది. ముంబైలో కేజీ వెండి రూ.83,400 ఉంది. దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.