Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. దిగి వచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు

|

Aug 20, 2021 | 6:36 AM

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు తాజాగా దిగి వచ్చాయి. నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి..

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. దిగి వచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Follow us on

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు తాజాగా దిగి వచ్చాయి. నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. తాజాగా శుక్రవారం తగ్గుముఖం పట్టింది. భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా 10 గ్రాముల ధరపై రూ.370 వరకు తగ్గుముఖం పట్టింది. దీంతో దేశీయంగా ధరలు భారీగానే తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. శుక్రవారం (ఆగస్టు 20) ఉదయం ఆరు గంటలకు నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,540 ఉంది.

► ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,130 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది.

► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూఊ.48,100 ఉంది.

అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. గత 10 రోజుల్లో బంగారం ధరలు 5 రోజులు తగ్గాయి. 4 రోజులు పెరిగాయి. 3 రోజులు స్థిరంగా ఉన్నాయి. బంగారం కొనుగోలు చేసే సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి.

ఇవీ కూడా చదవండి: Pre-Approved Loan: ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ అంటే ఏమిటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఎలాంటి అర్హతలుండాలి..?

Bank Customers: బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక నుంచి ఆ బ్యాంకులో వడ్డీ రేట్లు తగ్గింపు..!