Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. అక్షయ తృతీయ రోజు నిలకడగా ఉన్న బంగారం ధరలు

|

May 14, 2021 | 6:05 AM

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. రోజు పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా శుక్రవారం నిలకడగా ఉన్నాయి. నేడు అక్షయ..

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. అక్షయ తృతీయ రోజు నిలకడగా ఉన్న బంగారం ధరలు
Gold Price
Follow us on

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. రోజు పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా శుక్రవారం నిలకడగా ఉన్నాయి. నేడు అక్షయ తృతీయ. అందరు బంగారం ధరల్లో పెరుగుదల ఉంటుందని భావించినా.. ధరల మార్పులేమి జరగలేదు. తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న ధరల వివరాలు పరిశీలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,090 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 వద్ద ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది. నేడు అక్షయ తృతీయ ఉండటంతో బంగారం షాపులు కిటకిటలాడుతుంటాయి. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఉండటంతో కొనుగోళ్లు పెద్దగా ఉండే అవకాశాలు లేవు.

ఇవీ కూడా చదవండి:

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌తో పాటు ఐదు ప్రధాన నగరాల్లో మరింతగా గిడ్డంగుల విస్తరణ

EPF Withdrawal: వివిధ రకాల అవసరాల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చంటే..!

Silver Price Today: వెండి కొనుగోలు చేసేవారికి శుభవార్త.. అక్షయ తృతీయ రోజు దిగి వచ్చిన సిల్వర్‌ ధర..