Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా గురువారం తులం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే..

| Edited By: Subhash Goud

Jul 30, 2021 | 5:25 AM

Gold Price Today: భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండే వేరు. మన దేశంలో మహిళలు బంగారం కొనుగోళ్ల విషయంలో ధర ఎంత పెరిగినా.. ఏ మాత్రం వెనుకడుగు వేయరు. పసిడి అంటే భారతీయులకు...

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా గురువారం తులం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే..
Gold Price
Follow us on

Gold Price Today: భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండే వేరు. మన దేశంలో మహిళలు బంగారం కొనుగోళ్ల విషయంలో ధర ఎంత పెరిగినా.. ఏ మాత్రం వెనుకడుగు వేయరు. పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైంది. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా గురువారం దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం ఆరు గంటల సమయానికి దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,850 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,330 గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 ఉంది.
* బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,890 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890 ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890 గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890 గా ఉంది.
అయితే ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చాలా ఉంటుందంటున్నారు.

Also Read: ICICI Bank Alert: ఐసీఐసీఐ అలర్ట్.. ఆగస్టు నుంచి మారనున్న సర్వీస్ ఛార్జీలు.. వివరాలు..

Tax Saving Tips: మీరు ట్యాక్స్ పేయర్లా.. అయితే ఇలా పన్ను మినహాయింపులు పొందండి..

Bharti Airtel Tariffs: ఎయిర్ టెల్ కస్టమర్స్‌కు షాక్. రేపటి నుంచి పెరగనున్న కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్