Gold Price Today: గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Oct 31, 2021 | 6:30 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today
Follow us on

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. పండుగల సీజన్‌లో ధరలు రోజురోజుకు షాకిస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఆదివారం బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,740గా కొనసాగుతోంది. అయితే తులం బంగారంపై రూ.310 మేర ధర తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రేట్లు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,740గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,160గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,770గా ఉంది.

Also Read:

Puneeth Rajkumar Daughter: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె

PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..