Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నగరాల్లో రేట్లు ఇలా..
Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు మాత్రం నానాటికీ
Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. ప్రతిరోజూ బులియన్ మార్కెట్ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే.. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.160 మేర తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల ధర రూ.47,600 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600 లు ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 47,650 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 51,800 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,600 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,600 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,500 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,630 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,760 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,920 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,500 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,630 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,630 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,630 వద్ద కొనసాగుతోంది.
Also Read: