Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. గతకొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నిన్న నిలకడగా ఉన్న బంగారం ధర ఈరోజు కాస్తా తగ్గాయి. ఇది బంగారం కొనాలనుకునే వారికి కాస్తా ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఇవాళ (జూన్ 12న) ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,880 ఉండగా.. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,760 చేరింది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.48,760గా ఉంది.
ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలలో మార్పులు జరిగాయి. ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.52,640కు చేరింది. అలాగే దేశీయ ఆర్థిక రాజధాని ముంబైలో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,760 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,760గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధరరూ.46,350 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,550కు చేరింది. అటు బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100 ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100 ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా ఉంది.