పసిడి ప్రియులకు శుభవార్త. పసిడి ధరలు దిగొస్తున్నాయి. ఇటీవలి వరకు బంగారం ముట్టుకుంటే ఒట్టేనన్నట్టుండేది. ఆరుపదులు దాటి చాలాకాలమే అయ్యింది. పెళ్ళిళ్ళు.. పండుగలు.. శుభకార్యం ఏదైనా భారతీయుల ఇంట బంగారం ఉండాల్సిందే. అలాంటిది ఆకాశాన్నంటుతోన్న ధరలు ఆ మాటెత్తకుండా చేశాయి. అయితే, ఇప్పటి వరకు పైపైకి ఎగిసిన పసిడితల్లి ఇప్పుడిప్పుడే నేల చూపులు చూస్తోంది. గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజుల్లో బంగారం ధర దాదాపు రూ. 1000 తగ్గింది. శుక్రవారం భారత్‌లో బంగారం పది గ్రాములు రూ. 60,000 లకు దిగువనే ఉంది. ప్రపంచ మార్కెట్ ప్రభావంతో భారత్ బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది.
ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 300 తగ్గి, రూ.55,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి, రూ. 60,870కి దిగొచ్చింది. వెండి ధరలు సైతం కిలోకి రూ. 200 తగ్గి రూ. 74,300కు చేరింది. గత మూడు నెలల్లో ఇంత భారీ స్థాయిలో బంగారం ధరలు తగ్గడం ఇదే తొలిసారి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 1,975 డాలర్లకు పడిపోగా, వెండి ధర ఔన్సుకు 23.60 డాలర్లు పడిపోయింది. అయితే రాబోయే కొద్దిరోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..