బంగారం ధరలు తగ్గాయండోయ్!
ఢిల్లీ: బడ్జెట్‌లో కస్టమ్స్ టాక్స్ పెంచడంతో గత రెండు, మూడు రోజులుగా పసిడి ధర ఆకాశాన్ని తాకింది. అంతర్జాతీయంగా బలహీన ధోరణి, డాలరు రేటు తగ్గడంతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ఎట్టకేలకు నేడు బంగారం ధర తగ్గింది. బులియన్ మార్కెట్‌లో 10 గ్రా. పసిడి ధర రూ. 600 పడిపోయింది. వెండి ధర రూ. 48 తగ్గి, కిలో ధర రూ. 38,900 పలుకుతోంది. అటు వెండి కూడా నేడు స్వల్పంగా […]
ఢిల్లీ: బడ్జెట్‌లో కస్టమ్స్ టాక్స్ పెంచడంతో గత రెండు, మూడు రోజులుగా పసిడి ధర ఆకాశాన్ని తాకింది. అంతర్జాతీయంగా బలహీన ధోరణి, డాలరు రేటు తగ్గడంతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ఎట్టకేలకు నేడు బంగారం ధర తగ్గింది. బులియన్ మార్కెట్‌లో 10 గ్రా. పసిడి ధర రూ. 600 పడిపోయింది. వెండి ధర రూ. 48 తగ్గి, కిలో ధర రూ. 38,900 పలుకుతోంది. అటు వెండి కూడా నేడు స్వల్పంగా దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ. 48 తగ్గి రూ. 38,900 పలికింది. గత శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 10శాతం నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించించన విషయం తెలిసిందే.