పీక్స్ కు చేరిన బంగారం.. ఇప్పుడు పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా?

| Edited By: Ravi Kiran

Oct 31, 2024 | 9:53 PM

బంగారం ధరలు పెరుగుతునందు వల్ల బులియన్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం కోసం వేచి చూసే వారు. దీర్ఘ కాలికంగా పెట్టుబడులు పెట్టేవారు బంగారం లాంటి సురక్షితమైన వాటిపై పెట్టుబడులు పెట్టడం లాభదాయకం. అంతే కాదు గోల్డ్ రేట్లు కాస్త తగ్గుముఖం పట్టగానే ఇది వరకు ఉన్న పెట్టుబడులకు మరించి జోడించడం ఉత్తమం.

పీక్స్ కు చేరిన బంగారం.. ఇప్పుడు పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా?
113898003
Follow us on

గత వారంలో బంగారం ధరలు జీవితకాల గరిష్ట స్థాయికి పెరిగాయి. గత ఐదేళ్లలో మన దేశంలో బంగారం ధరలు రెట్టింపు అయ్యాయి, ఈ ఏడాది 24 శాతానికి పైగా పెరిగాయి. ధరలలో ఈ గణనీయమైన పెరుగుదల పెట్టుబడిదారులను గందరగోళానికి గురి చేస్తోంది. భవిష్యత్తులో ధరల కదలికలపై మరియు కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయమా అనే ప్రశ్నల అందరిని తొలచివేస్తున్నాయి.

కొన్ని నెలలుగా బులియన్ జోరందుకోవడానికి కారణం పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, US ఫెడ్ రేట్ల కోతలు, US అధ్యక్ష ఎన్నికల చుట్టూ ఉన్న అనిశ్చితి మరియు US ఉద్యోగాల సంఖ్య క్షీణించడం బంగారం ధరల పెరుగదలకు దోహదం చేస్తున్నాయి. ప్రపంచ వృద్ధి బలహీనపడుతున్నట్లు సంకేతాలు రావడం కూడా బంగారం ధరలు పెరుగుతు వచ్చాయి.

బంగారం ధరల పెరుగుదలపై సరఫరా-డిమాండ్ తోపాటు అనేక కారకాలు డైనమిక్స్‌ను ప్రభావితం చేస్తాయి కాబట్టి, బంగారం ధరలు సాధారణంగా స్వల్ప మరియు మధ్యస్థ కాలంలో గణనీయమైన హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అందువల్ల, స్వల్పకాలిక వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరైన సమయం కోసం వేచి చూడవలసి ఉంటుంది.

మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులను మరింత దిగజార్చాయి, దీంతో దేశీయంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు తమ ప్రాధాన్యతలను మార్చడానికి దారితీసింది. సాధారణాంగా రాజకీయ సంక్షోభం నెలకున్నప్పుడు కాని, యుద్ధ సమయంలో ప్రపంచ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపుతాయి కాబట్టి పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తారు.

ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. బంగారం వంటి సురక్షితమైన వస్తువులకు గరిష్ట పరిమితి లేదు. డిమాండ్ సరఫరాను మించి ఉంటే, ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఇటువంటి సమయంలోనే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ధరలు తగ్గినప్పుడు మరిన్ని పెట్టుబడులు జోడించడం ఉత్తమమైనది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.