Gold Hallmark: బంగారం నాణ్యతను గుర్తించేందుకు ఉద్దేశించిన హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఇది వరకు హాల్ మార్క్ పద్ధతి అమలు చేయాలని 2019లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వ్యాపారుకులకు 2021, జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. అయితే గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం, లాక్‌డౌన్ కారణంగా బంగారం దుకాణాలు సైతం మూతపడడంతో ఈ గడువును పెంచాలని వ్యాపారులు కేంద్రాన్ని కోరారు. దీనికి ఓకే చెప్పిన కేంద్రం జూన్ 1 వరకు గడువు పొడగించింది. ఇక మరోసారి ఈ తేదీని పెంచబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే హాల్‌మార్క్‌ను తాజాగా బంగారం వ్యాపారులు మరో ఏడాది పొడగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరోనా కారణంగా వ్యాపారాలు తగ్గిపోయాయని, పాత బంగారు ఆభరణాలు ఇంకా పూర్తిగా అమ్ముడిపోని పరిస్థితుల్లో హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని వ్యాపారులు వాపోతున్నారు. డెడ్‌లైన్‌ను కనీసం ఏడాది పెంచాలని కోరుతున్నారు. అంతేకాకుండా తమ సమస్యలను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలకు హాల్ తప్పసరి తేదీని ప్రభుత్వం మరోసారి పెంచుతుందా.? లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
Also Read: Pawan Kalyan: దూకుడు పెంచిన పవర్ స్టార్.. పవన్ కొత్త సినిమా కోసం భారీ కాలేజ్ సెట్..
నాటు.. అదే రూటు..! పక్క రాష్ట్రాల నుంచి గుట్టుగా నాటుసారా ప్రవాహం.. పట్టుకున్న అధికారులు..