బంగారం కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్న వారికి గుడ్ న్యూస్. బుధవారం గోల్డ్ రేట్స్ తగ్గాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు, నేడు తగ్గాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడం, బంగారానికి డిమాండ్ ఉన్న నేపథ్యంలోనూ ధరలు తగ్గడం ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. బుధవారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ. 53,040 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,610 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,880 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,460 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ. 53,630 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,160 గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,930 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,510 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో బుధవారం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,880 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,460 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 24 క్యారెట్ల బంగారం రూ. 52,850 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,450గా నమోదైంది.
* సాగర తీరం విశాఖలో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,450 గా ఉంది.
బుధవారం వెండి ధరల్లో మార్పులు కనిపించలేవు. మంగళవారం కిలో వెండిపై ఏకంగా రూ. 600 పెరగగా బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,400 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,400 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషాయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,100 కాగా, విజయవాడలో, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 68,100 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..