AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

Gold, Silver Prices Today: ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రచురించిన ధరలు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయి. ఈ బంగారం, వెండి ధరలలో GST చేర్చలేదు. అలాగే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు తయారీ ఛార్జీలను విడిగా చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
Gold Price Today
Subhash Goud
|

Updated on: Jun 02, 2026 | 6:41 AM

Share

Gold, Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన పసిడి ధరలు క్రమంగా దిగి వస్తు్న్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. కొనుగోలుదారులు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. వివిధ దేశాల ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పటికీ బంగారం ధరలు ఒక రోజు స్థిరంగా , మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల కిందట తులం ధర రూ.1.60 లక్షల వరకు వెళ్లిన బంగారం ధర.. క్రమంగా దిగి వస్తోంది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. మంగళవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,190గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,360గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,340గా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,170గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,990గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190గా ఉంది.

ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద ట్రేడవుతుండగా, చెన్నై, కేరళలో ఇదే ధరతో కొనసాగుతోంది. అలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లో రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రచురించిన ధరలు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయి. ఈ బంగారం, వెండి ధరలలో GST చేర్చలేదు. అలాగే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు తయారీ ఛార్జీలను విడిగా చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

ఈ నెల మొదటి రోజున బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్ (MCX) లో ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు రూ.1,500 కంటే ఎక్కువగా పడిపోగా, వెండి ధరలు దాదాపు అంతే మొత్తంలో తగ్గింది. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా ఈ తగ్గుదల చోటుచేసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us