Gold and Silver Price Today: పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

Gold And Silver Price Today: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా తగ్గుముఖం..

Gold and Silver Price Today: పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
Gold And Silver
Subhash Goud

|

Jun 20, 2021 | 6:15 AM

Gold And Silver Price Today: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆదివారం పసిడి, వెండి ధరలు దిగి వచ్చాయి. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొక రోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.1,120 వరకు తగ్గుముఖం పట్టగా, కిలో వెండి ధరపై రూ.11000 వరకు తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300 ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,920 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

ఇక తెలుగు రాస్ట్రాల్లోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

అయితే ఆదివారం ఉదయం ఉన్న ధరలు ఇవి. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

వెండి ధరలు..

ఇక వెండి కొనుగోలుదారులకు కూడా శుభవార్తే. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. ఇక తాజాగా దేశీయంగా కిలో వెండిపై రూ.1100 వరకు తగ్గుముఖం పట్టింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, చెన్నైలో రూ.73,100 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కోల్‌కతాలో రూ.67,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కేరళలో రూ.67,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,100 ఉండగా, విజయవాడలో రూ.73,100 ఉంది.

ఇవీ కూడా చదవండి:

Older Vehicles: మీరు పాత వాహనాలు నడుపుతున్నారా..? అయితే జాగ్రత్త.. రూ.10 వేలు జరిమానా కట్టాల్సిందే..!

Aadhaar Card Update: ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీ, ఇతర వివరాలు తప్పుగా ఉన్నాయా..? లింక్ ద్వారా మార్చండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu