దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న ధర కంటే వచ్చే ఏడాది జనవరిలో మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ నుంచి బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు నెలల్లో 10 గ్రాముల బంగారంపై రూ.4,000, వెండి కిలో రూ.11,000కు పైగా పెరిగింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్చి 2020లో కోవిడ్ మొదటి వేవ్ సమయంలో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 40 వేల రూపాయలు ఉండేది. కానీ సమయం దాటిన కొద్దీ బంగారం ధర పెరిగిపోయింది. ఆగస్ట్ 2020 నాటికి బంగారం రికార్డు స్థాయి 10 గ్రాములకు రూ.56,200కి చేరుకుంది. ఐదు నెలల్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 16 వేల వరకు ఎగబాకింది. కోవిడ్ కారణంగా ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారని, దీంతో ధర పెరిగిందని.. ధర విషయంలో మళ్లీ అదే వాతావరణం నెలకొందని నిపుణులు చెబుతున్నారు.
అయితే బంగారం ధర రూ.1600 నుండి రూ.3000 వరకు పెరగవచ్చని అంటున్నారు. చైనాలో ఫోర్త్‌వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో దేశంలో కూడా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. ఇన్ని పరిస్థితుల నడుమ బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ధర కంటే 1600 నుండి 3000 రూపాయల వరకు పెంచవచ్చు. ప్రస్తుతం బంగారం 54500 వద్ద కొనసాగుతోంది. అంటే కొత్త సంవత్సరంలో బంగారం తన రెండున్నరేళ్ల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోమవారం, మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX), బులియన్ మార్కెట్లో బంగారం పెరుగుదల ఉండగా, వెండి తగ్గింది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,480 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి