Gold Rates: అమ్మబాబోయ్.. ఇక కొనడం కష్టమే.. ఆల్ టైం హైకి బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
బంగారం ధర పరుగులు పెడుతోంది.. పసిడి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది. బంగారంతోపాటు వెండి ధర కూడా భగ్గుమంటోంది. బంగారం ధర నాన్‌స్టాప్‌గా.. పెరిగి లక్షా 10 వేల మార్క్ దాటింది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది.. మంగళవారం (సెప్టెంబర్ 9, 2025) బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి..

బంగారం ధర పరుగులు పెడుతోంది.. పసిడి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరింది. బంగారంతోపాటు వెండి ధర కూడా భగ్గుమంటోంది. బంగారం ధర నాన్‌స్టాప్‌గా.. పెరిగి లక్షా 10 వేల మార్క్ దాటింది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది.. మంగళవారం (సెప్టెంబర్ 9, 2025) బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ఏకంగా రూ.1,360 పెరిగి.. 1,10,290కి చేరింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.1250 మేర ధర పెరిగి.. రూ.1,01,100 కి పెరిగింది. అటు వెండి కూడా కిలో పై రూ.3వేలు పెరిగి.. రూ.1,30,000కి చేరింది.. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
- హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,290 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,40,000 గా ఉంది.
- విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,10,290 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,40,000 గా ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల బంగార ధర 1,10,440, 22 క్యారెట్ల ధర రూ.1,01,250 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,30,000లుగా ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగార ధర 1,10,290, 22 క్యారెట్ల ధర రూ.1,01,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,30,000లుగా ఉంది.
- చెన్నైలో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,10,730 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,01,500 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,40,000 గా ఉంది.
ట్రంప్ సుంకాల సీజన్ మొదలైనప్పటి నుంచి బంగారం- టాప్‌గేర్‌లో పరుగులు పెడుతోంది. గత రెండునెలల్లో పసిడి స్పీడుకు పగ్గాలు పడటం లేదు. రోజురోజుకీ ధర పెరుగుతుందేగానీ, డౌన్‌ట్రెండ్ మాత్రం కనిపించడం లేదని మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




