Gold & Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

జూన్ 2న దేశీయ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు

Gold & Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Silver
Follow us

|

Updated on: Jun 02, 2022 | 7:35 AM

పసిడి ప్రియులకు శుభవార్త.. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. ఈ నెల ఆరంభం నుంచి పడిపోతూనే ఉన్నాయి. జూన్ నెల ప్రారంభం నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి (Gold Price). వరుసగా రెండోరోజు సైతం పసిడి ధరలు దిగొచ్చాయి. జూన్ 2న దేశీయ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 250 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,500గా కొనసాగుతుంది. ఇలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,820కు చేరింది.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరలలో మార్పులు జరిగాయి… జూన్ 2న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.47,500గా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,820కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,500 చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 51,820కు చేరింది. అలాగే.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,500 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,820 ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,500 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ. 51,820కు చేరింది. ఇక పసిడి బాటలోనే వెండి పయనిస్తోంది. వరుసగా రెండో రోజు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.47,500గా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,820కు చేరింది

వెండి ధరలు..

దేశీయ మార్కెట్లో జూన్ 2న సిల్వర్ రేట్స్ పడిపోయాయి. కేజీ వెండి ధర రూ. 60,600కు చేరింది. ఇక ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్స్ సైతం తగ్గాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ రూ. 67000కు చేరింది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.60600 ఉండగా.. చెన్నైలో కేజీ సిల్వర్ రూ. 67,000కు చేరింది. అలాగే బెంగుళూరులో కేజీ సిల్వర్ రేట్ రూ. 67000 ఉండగా.. హైదరాబాద్‏లో కిలో వెండి ధర రూ. 67000 ఉంది.. అలాగే విజయవాడ, విశాఖపట్నంలోనూ కేజీ సిల్వర్ రేట్ రూ. 67000గా ఉంది.