Gold and Silver Price Today(August 24th2021): కరోనా సమయంలో ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్న బంగారం వెండి ధరలు.. గత కొన్ని నెలలుగా దిగి వచ్చాయి. అయితే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలతో పసిడికి మళ్ళీ రెక్కలు వచ్చాయి. దీంతో ఆగష్టు నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45,000కు దగ్గరగా కదలాడుతోంది. ఇదే విషయంపై మార్కెటింగ్ నిపుణులు స్పందిస్తూ.. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా సెకండ్ వేవ్, ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి వివిధ అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని తెలిపారు. ఇక మరోవైపు వెండి కూడా బండారం బాటలోనే పయనిస్తుంది. వెండి ధరలు కూడా కిలో రూ.67,000కు దగ్గరగా ఉంది.
బంగారం ధరలు నిన్నటి తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 110 మేర పెరిగింది. ఈ రోజు(24-08-2021 మంగళవారం) నాటికి రూ. 44,250గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,140లకు చేరుకుంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,160గా ఉండగా, ఈ రోజు రూ.48,270లుగా నమోదైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,270గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,270గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,260గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది.
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,610గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660గా ఉంది.
వెండి ధరలు:
నిన్నటి ధరలతో పోలిస్తే వెండి ధరలు కూడా స్వల్పంగానే రూ. 40మేర పెరిగింది. నేడు (24-08-2021 మంగళవారం) వెండి 10 గ్రాములు రూ.666.60 గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 66,600గా ఉంది.
ఈ పసిడి, వెండి ధరలు ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు..కనుక ఎప్పటికప్పుడు జరిగే మార్పులను గమనించి వినియోగదారులు బంగారం నగలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Also Read: Chanakya Niti: ప్రపంచంలో కత్తి కంటే నాలుక పదునైనది అంటున్న చాణక్య.. దానిని ఎలా ఉపయోగించాలంటే