Gold Price Today: దసరా రోజు షాకిచ్చిన గోల్డ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

|

Oct 05, 2022 | 6:33 AM

బంగారం ధరలు తాజాగా పెరగడం ప్రారంభించాయి. బుధవారం పెరిగిన బంగారం.. బుధవారం కూడా అదే బాటలో పయణించింది. దసర పండుగ రోజున భారీగా పెరిగి, బంగారం ప్రియులకు షాకిచ్చింది.

Gold Price Today: దసరా రోజు షాకిచ్చిన గోల్డ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price
Follow us on

గత రెండు రోజుల పాటు వినియోగదారులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు తాజాగా పెరగడం ప్రారంభించాయి. బుధవారం పెరిగిన బంగారం.. బుధవారం కూడా అదే బాటలో పయణించింది. దసర పండుగ రోజున భారీగా పెరిగి, బంగారం ప్రియులకు షాకిచ్చింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో తులం బంగారంపై మరోసారి సుమారు రూ. 500 వరకు పెరిగింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల ఎలా ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51, 820గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,350 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,660 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,100 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 47,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధరూ. 51,710 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 47,350 గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 51,660 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,350 కాగా, 24 క్యారట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 51,660 గా ఉంది.

* సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 47,350 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,660గా ఉంది.

వెండి ధరల విషయానికొస్తే..

వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. సోమవారం స్థిరంగా కొనసాగిన వెండి ధర, మంగళవారం పెరిగింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎలా ఉందంటే..

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,800 కాగా, ముంబైలో రూ. 61,800, చెన్నైలో రూ. 66,700 , బెంగళూరులో రూ. 66,700 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ. 66,700 వద్ద కొనసాగుతోంది.