Gold Price: మగువలకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

|

Sep 01, 2022 | 6:39 AM

Gold And Silver Price Today: పసిడి కొనాలనుకునేవారికి శుభవార్త. గురువారం బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,000 వద్ద కొనసాగుతోంది.

Gold Price: మగువలకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price
Follow us on

Gold And Silver Price Today: పసిడి కొనాలనుకునేవారికి శుభవార్త. గురువారం బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,000 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాముల రూ.270 తగ్గడంతో రూ.51,270పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. ఇవాళ బులియన్‌ మార్కెట్‌లో చాలా నగరాల్లో కిలో వెండి రూ. 50,800కే లభిస్తోంది. మరి గురువారం(సెప్టెంబర్‌1) మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51,270 పలుకుతోంది

☛ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51 270 వద్ద ఉంది.

☛ బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,320 పలుకుతోంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,540గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,860 పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,270 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.51,440 పలుకుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.51,270కు లభిస్తోంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.51,270 వద్ద ఉంది.

తగ్గిన వెండి ధరలు

బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గురువారం సిల్వర్‌ ధరలు భారీగాతగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.60,000గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఇదే వెండి బెంగళూరు, ఢిల్లీ,కోల్‌కతా నగరాల్లో రూ.50,800 పలుకుతోంది.

గమనిక:
బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..