Gold and Silver Price: జులై నెలలో పెరిగిన బంగారం..వెండి ధరలు..భవిషత్ లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు
బంగారం, వెండి ధరలు గత నెలలో పైకెగశాయి. అంతకు ముందు జూన్ నెలలో వీటి ధరలు తగ్గుదల కనబరిచాయి. అయితే, మార్కెట్ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం రాబోయే నెలల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
Gold and Silver Price: బంగారం, వెండి ధరలు గత నెలలో పైకెగశాయి. జూలైలో బంగారం ధర 10 గ్రాములకు రూ .1,236 పెరిగి రూ .48,430 కు చేరుకుంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చెబుతున్న దాని ప్రకారం, జూలై 1 న బులియన్ మార్కెట్లో బంగారం రూ .47,194 వద్ద ఉంది. అంటే, ఈ నెలలో బంగారం ధర దాదాపు 3% పెరిగింది. జూలై 1 తేదీతో పోల్చితే నెలాఖరుకు వెండి కూడా స్వల్పంగా పెరిగింది , వెండి కిలో రూ. 67,832 వద్ద ఉంది, అది ఇప్పుడు రూ. 68,053 కి చేరుకుంది. అంటే, ఇది జూలైలో రూ. 221 పెరిగింది. జూలైలో ఒకసారి వెండి ధర 69 వేలు దాటింది.
జూన్‌లో బంగారం, వెండి ధరలు కిందికి..
గత నెలలో అంటే, జూన్‌లో బంగారం, వెండి ధరలలో భారీ పతనం చోటుచేసుకుంది. జూన్ 1 న 10 గ్రాములకు రూ. 49,422 గా ఉన్న బంగారం జూన్ 30 న రూ. 46,753 కి తగ్గింది. అంటే బంగారం ధర రూ .2,669 తగ్గిపోయింది. మరోవైపు, వెండి గురించి చూస్తే, ఇది రూ .2,669 తగ్గిపోయింది. జూన్ 1 న కిలో రూ. 72,428 వద్ద ఉంది, ఇది జూన్ 30 న రూ. 67,747 కి చేరుకుంది.
ఈ సంవత్సరం చివరినాటికి బంగారం 55 వేలకు..
ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ), అనూజ్ గుప్తా మాట్లాడుతూ, మూడో వేవ్ కరోనా భయం,పెరుగుతున్న ద్రవ్యోల్బణం బంగారానికి మద్దతు ఇస్తోంది. ఈ కారణంగా, సంవత్సరం చివరినాటికి బంగారం మళ్లీ 10 గ్రాములకు 55 వేలకు చేరుకుంటుంది. అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం.
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం 1800 దాటింది..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌కు 1,814 డాలర్లకు చేరుకుంది. ఇది జూలై 1 న 1,770 డాలర్లుగా ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా చెబుతున్న దాని ప్రకారం, ఈ ఏడాది చివరినాటికి, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌కు 2,200 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంటుంది.
బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
కేడియా కమోడిటీ డైరెక్టర్ అజయ్ కేడియా మాట్లాడుతూ ”దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం ప్రారంభించాయన్నారు. అందువల్ల ప్రజలలో మూడవవేవ్ భయం ఉంది. ఇది కాకుండా, దేశంలో ద్రవ్యోల్బణం కూడా పెరగడం ప్రారంభమైంది. అందువల్ల బంగారం ధర ఇంకా ఎక్కువ మద్దతు పొందుతోంది.” అని చెప్పారు.
Gold Loan: నిమిషాల్లోనే బంగారంపై రుణాలు.. వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇవే..!