Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే

రెండు రోజులు తగ్గితే.. మరో మూడు రోజులు భారీగా పెరుగుతోంది బంగారం ధర. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇస్తూ.. ఇప్పుడు మరోసారి గోల్డ్ రేట్స్‌ పైపైకి ఎగబాకాయి. గత మూడు రోజుల్లో సుమారు రూ. 550 మేరకు తగ్గిన బంగారం ధర.. గురువారం ఏకంగా రూ. 200 వరకు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే
Gold Representative Image

Updated on: Jul 12, 2024 | 6:48 AM

రెండు రోజులు తగ్గితే.. మరో మూడు రోజులు భారీగా పెరుగుతోంది బంగారం ధర. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇస్తూ.. ఇప్పుడు మరోసారి గోల్డ్ రేట్స్‌ పైపైకి ఎగబాకాయి. గత మూడు రోజుల్లో సుమారు రూ. 550 మేరకు తగ్గిన బంగారం ధర.. గురువారం ఏకంగా రూ. 200 వరకు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే పెళ్లిళ్ల సీజన్ కానప్పటికీ బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతోందన్న లెక్క. పెరిగిన గోల్డ్ రేట్‌తో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ధరల్లో తేడా కనిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ధరలు మాత్రం సమానంగా ఉన్నాయి. ఇక ఇలా భారీగా పెరుగుతోన్న బంగారం ధరలు చూసి.. పసిడిని కొనాలంటేనే జంకుతున్నారు పసిడిప్రియులు.

సోమవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ. 6,731గా ఉంటే.. 10 గ్రాములు(తులం) రూ. 67,310 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ విషయానికొస్తే.. గ్రాము ధర రూ. 7343గా ఉంది. 10 గ్రాములు(తులం) రూ.73 వేల 430 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

ఇవి కూడా చదవండి

షాకిచ్చిన వెండి..

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా షాకిస్తున్నాయి. ఒక్క రోజులోనే ఏకంగా రూ. 1100 మేరకు పెరిగి కిలో వెండి రూ. 95,600 వద్ద కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ. లక్ష మార్క్ దాటింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ప్రస్తుతం రూ. 1 లక్షా 100 పలుకుతోంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి రూ. 95,600 ఉండగా.. బెంగళూరులో కిలో వెండి రూ. 95,100గా ఉంది.

ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us