Year End Discounts: ఈ-కార్లపై క్రేజీ ఆఫర్స్.. రూ. 4లక్షల వరకూ భారీ డిస్కౌంట్స్.. కొద్ది రోజులే అవకాశం..
కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై కంపెనీలు అదిరే ఆఫర్లను ప్రకటించాయి. ఏకంగా రూ. 60,000 నుంచి రూ. 4లక్షల వరకూ తగ్గింపులు అందిస్తున్నాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకూ మాత్రమే ఉండనున్నాయి. అన్ని టాప్ బ్రాండ్ కార్లు ఈ డిస్కౌంట్ ధరల్లో లభిస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఎంజీ మోటార్, టాటా మోటార్స్ కు చెందిన ఎలక్ట్రిక్-వెహికల్ (ఈవీ)లపై ఈ ప్రత్యేకమైన డీల్స్ ను అందిస్తున్నాయి

మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2023 కనుమరుగు కాబోతోంది. ఈ క్రమంలో సాధారణంగా అన్ని ఉత్పత్తులపై అనేక రకాల ఆఫర్లు ఉంటాయి. ఎందుకంటే 2023లో తయారైన ప్రతి వస్తువు కొత్త సంవత్సరంలో అది పాత మోడల్ అయిపోతోంది. ఈ క్రమంలో చాలా వరకూ స్టాక్ క్లియరెన్స్ కోసం డిస్కౌంట్లు ప్రకటిస్తారు. ఇదే క్రమంలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై కంపెనీలు అదిరే ఆఫర్లను ప్రకటించాయి. ఏకంగా రూ. 60,000 నుంచి రూ. 4లక్షల వరకూ తగ్గింపులు అందిస్తున్నాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకూ మాత్రమే ఉండనున్నాయి. అన్ని టాప్ బ్రాండ్ కార్లు ఈ డిస్కౌంట్ ధరల్లో లభిస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఎంజీ మోటార్, టాటా మోటార్స్ కు చెందిన ఎలక్ట్రిక్-వెహికల్ (ఈవీ)లపై ఈ ప్రత్యేకమైన డీల్స్ ను అందిస్తున్నాయి. వాస్తవానికి ఇదే సమయానికి ఈ ఆఫర్లు కేవలం రూ. 2.5లక్షలుగా ఉండగా.. ఈ సారి ఏకంగా రూ. 4లక్షల వరకూ వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి. వాటిల్లో డైరెక్ట్ క్యాష్ తగ్గింపుతో పాటు, ఎక్స్ చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ వంటివి కలిపి ఉంటాయి. ఏయే కార్లు ఎంతమేర తగ్గింపు లభిస్తుందో ఓ సారి చూద్దాం..
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ..
ఈ కారుపై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ. 4.2 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే దీనిలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) ఫీచర్ ఉండదు. ఒకవేళ ఎక్స్‌యూవీ400 ఈఎస్సీ ఫీచర్ కావాలనుకుంటే మాత్రం తగ్గింపు ధర కాస్త పెరుగుతుంది. మొత్తం మీద ఈఎస్సీ వెర్షన్‌లు రూ. 3.2 లక్షల మేర తగ్గింపుతో వస్తాయి. దీనిలో ఎంట్రీ-లెవల్ ఈవీ వేరియంట్ పై కంపెనీ రూ. 1.7 లక్షల వరకు తగ్గింపును కూడా అందిస్తోంది.
హ్యుందాయ్ కోనా ఈవీ..
పర్యావరణ హిత ఎలక్ట్రిక్ కారుపై హ్యూందాయ్ దాదాపు రూ. 3లక్షల వరకూ తగ్గింపును అందిస్తోంది. దీనిలో 39.2 కేడబ్ల్యూ బ్యాటరీతో పాటుప్రామాణిక ఏసీ చార్జర్, 50 కేడబ్ల్యూ డీసీ చార్జర్ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 6 గంటల్లోనే బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తుంది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ..
ఈ కారులపై కూడా అదిరే డిస్కౌంట్ లభిస్తోంది. ఇప్పటికే అనువైన బడ్జెట్లో ఉండే ఈ కారుపై ఇప్పుడు రూ. 1లక్షకు పైగా తగ్గింపును అందిస్తున్నారు. ఎంజీ జెడ్ఎస్ ఈవీపై 50,000 వరకూ ఎక్స్ చేంజ్ బోనస్, లాయల్టీ, కార్పొరేట్ డీల్స్ తో రూ. 50,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ ధర మార్కెట్లో రూ. 23.38లక్షలుగా ఉంది.
ఎంజీ కామెట్..
చిన్న కారు కానీ లగ్జరీ ఫీచర్లతో మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారుపై కూడా ఆఫర్లు అందిస్తున్నారు. ఈ ఏడాది మేలోనే దీనిని మార్కెట్లోకి లాంచ్ చేసింది. అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా రూపొందిన ఈ కారు మార్కెట్ ధర రూ. 7.98 లక్షలతో ప్రారంభమవుతుంది. ఈ కారు కామెట్ పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వెర్షన్లలో లభిస్తోంది. ఇప్పుడు దీనిపై రూ. 65,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. తద్వారా 2023 స్టాక్ క్లియరెన్స్ చేయాలని భావిస్తోంది. ఈ ఆఫర్లో ఎక్స్ చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ వంటి మిళితమై ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..