Gautam Adani: పుట్టిన రోజున కీలక నిర్ణయం తీసుకున్న అపర కుబేరుడు.. రూ.60 వేల కోట్లతో..

|

Jun 23, 2022 | 8:47 PM

Gautam Adani Birthday: అపర కుబేరుడు, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) మరికొన్ని గంటల్లో 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. శుక్రవారం (జూన్‌24) ఆయన పుట్టిన రోజు. వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతోన్న ఈ బిజినెస్‌ టైకూన్‌..

Gautam Adani: పుట్టిన రోజున కీలక నిర్ణయం తీసుకున్న అపర కుబేరుడు.. రూ.60 వేల కోట్లతో..
Gautam Adani
Follow us on

Gautam Adani Birthday: అపర కుబేరుడు, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) మరికొన్ని గంటల్లో 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. శుక్రవారం (జూన్‌24) ఆయన పుట్టిన రోజు. వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతోన్న ఈ బిజినెస్‌ టైకూన్‌ తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు రూ.60వేల కోట్లతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యం నెరవేరేలా విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో దాతృత్వ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. శుక్రవారంతో అదానీకి 60వ ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అదానీ కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే గౌతమ్‌ అదానీ తండ్రి శాంతిలాల్‌ అదానీ శత జయంతి కూడా ఇదే ఏడాది కావడంతో పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

కాగా ఈ సేవా కార్యక్రమాల కోసం మూడు కమిటీలు నియమిస్తామన్నారు గౌతమ్‌ అదానీ . ఈ మొత్తాన్ని ఏయే రూపాల్లో ఖర్చు చేయాలనేది ఆయా కమిటీలు నిర్ణయిస్తాయని, తన కుటుంబ సభ్యులు కమిటీల్లో సహాయక సభ్యులుగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. కాగా1988లో కమొడిటీ ట్రేడింగ్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో బొగ్గు, మైనింగ్‌, లాజిస్టిక్స్‌, విద్యుదుత్పత్తి, విద్యుత్‌ పంపిణీ, గ్రీన్‌ ఎనర్జీ, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లు, సిమెంట్‌ తదితర రంగాల్లో అదానీ గ్రూప్‌ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందుకు తగ్గట్లే ఆయన సంపద కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదే అదానీ సంపద 15 బిలియన్‌ డాలర్లు పెరగడం విశేషం. ఈక్రమంలో ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్‌ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్‌-10లో గౌతమ్‌ అదానీకి స్థానం దక్కింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..