Pan Card: పది నిమిషాల్లోనే ఫ్రీగా కొత్త పాన్ కార్డు.. కానీ ఆధార్‌లో అది తప్పనిసరి

|

Oct 11, 2024 | 4:10 PM

పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ అవసరాలతో పాటు పన్ను సంబంధిత ప్రయోజనాల కోసం తప్పనిసరిగా మారింది. భారతదేశంలోని వ్యక్తులకు, సంస్థలకు భారతదేశ ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. పాన్ అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్. ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఈ ఐడెంటిఫైయర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

Pan Card: పది నిమిషాల్లోనే ఫ్రీగా కొత్త పాన్ కార్డు.. కానీ ఆధార్‌లో అది తప్పనిసరి
Pan Card
Follow us on

పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ అవసరాలతో పాటు పన్ను సంబంధిత ప్రయోజనాల కోసం తప్పనిసరిగా మారింది. భారతదేశంలోని వ్యక్తులకు, సంస్థలకు భారతదేశ ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. పాన్ అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్. ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఈ ఐడెంటిఫైయర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సంప్రదాయ పద్ధతిలో భౌతిక పాన్ కార్డును పొందడం అనేది ప్రింటింగ్, తపాలా, మాన్యువల్ హ్యాండ్లింగ్ కారణంగా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఈ-పాన్‌ అందజేస్తుంది. ఈ కొత్త సదుపాయం ద్వారా పది నిమిషాల్లోనే మనకు పాన్ నెంబర్ కేటాయించి మన కార్డును మన ఈ-మెయిల్‌కు పంపుతారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టంట్ పాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఈ-పాన్ సదుపాయం అనేది ఆధార్ నంబర్‌ను ఉన్న దరఖాస్తుదారుల కోసం రూపొందించారు. దరఖాస్తుదారులకు పాన్ పీడీఎఫ్ వారి మెయిల్‌కు పంపుతారు. పైగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి ఉచితంగా ఉంటుంది. ఈ-పాన్ కార్డు ఆధార్‌కు సంబంధించిన ఈ-కేవైసీ  డేటా ఆధారంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ-పాన్ ఎలా అప్లయ్ చేయాలో? చూద్దాం.

ఈ-పాన్ పొందడం ఇలా

  • ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించాలి
  • ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీలో ఇన్‌స్టంట్ ఈ-పాన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఈ-పాన్ పేజీలో కొత్త గెట్ న్యూ ఈ-పాన్‌ను ఎంచుకోవాలి. 
  • గెట్ న్యూ ఈ-పాన్ పేజీలో మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, చెక్‌బాక్స్‌ వద్ద టిక్ చేసి కంటిన్యూ అని ఎంచుకోవాలి. 
  • ఓటీపీ ధ్రువీకరణ పేజీలో నేను అన్ని నిబంధనలను చదివాను, తదుపరి కొనసాగడానికి అంగీకరిస్తున్నాను ఆప్షన్‌పై క్లిక్ చేసి, కంటిన్యూ అని క్లిక్ చేయాలి. 
  • ఓటీపీ ధ్రువీకరణ పేజీలో ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీని నమోదు చేయాలి. యూఐడీఏఐ ఆధార్ వివరాలను ధ్రువీకరించడానికి చెక్‌బాక్స్‌ని ఎంచుకుని కొనసాగించు క్లిక్ చేయాలి.
  • ఆధార్ వివరాలను ధ్రువీకరించడం నేను అంగీకరిస్తున్నాను చెక్‌బాక్స్‌ని ఎంచుకుని కంటిన్యూపై క్లిక్ చేయాలి. 

అనంతరం సబ్‌మిట్ అప్లికేషన్ ఆప్షన్‌ను ఎంచుకుని రసీదు సంఖ్యను భ్రద్రపర్చుకోవాలి. అనంతరం ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు నిర్ధారణ సందేశం వస్తుంది. తర్వాత పది నిమిషాల్లో మీ పాన్ కార్డు మీరు నమోదు చేసిన ఈ-మెయిల్ ఐడీకు వస్తుంది. లేదా రసీదు సంఖ్య ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి