Free Health Insurance for Orphans: దేశంలో గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ ఆంక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అనాథ పిల్లల ప్రయోజనాల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా అనాథలైన 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ట్వీట్ చేశారు. కోవిడ్‌తో బాధపడుతున్న పిల్లల సంరక్షణ కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే దాని ప్రీమియం పీఎం కేర్స్ ద్వారా చెల్లించబడుతుందని తెలిపారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఇద్దరిని కోల్పోయిన 18 సంవత్సరాల వయసున్న పిల్లలు నెలవారీ స్టైఫండ్ అందుకుంటారని కేంద్ర మంత్రి తన ట్వీట్‌తో తెలిపారు. ఇక 23 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి రూ.10 లక్షలు మొత్తం ఇవ్వబడుతుందని తెలిపారు.
కాగా, పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 29, 2021న ప్రారంభించారు. మార్చి 11, 2020 నుంచి కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న వారు కోల్పోయినట్లతే అలాంటి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
कोविड से प्रभावित बच्चों के देखभाल हेतु उठाए कदमों के तहत 18 साल तक के बच्चों को आयुष्मान भारत के तहत 5 लाख रुपये का मुफ्त स्वास्थ्य बीमा दिया जाएगा और इसके प्रीमियम का भुगतान पीएम केयर्स द्वारा किया जाएगा। #MonsoonSession https://t.co/Gxpj7sFlYV pic.twitter.com/kfa7fTWigq
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) August 4, 2021