Bank Rules: బ్యాంకులో ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌, విత్‌డ్రా చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.. లిమిట్‌ దాటితే జరిమానే!

|

Jul 19, 2022 | 4:39 PM

Bank Rules: బ్యాంకు లావాదేవీల విషయంలో ఎన్నో నిబంధనలు మారుతున్నాయి. బ్యాంకు అకౌంట్లపై ఎక్కువ లావాదేవీలు జరిపే వారిపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రత్యేక నిఘా పెట్టింది..

Bank Rules: బ్యాంకులో ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌, విత్‌డ్రా చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి.. లిమిట్‌ దాటితే జరిమానే!
Bank Rules
Follow us on

Bank Rules: బ్యాంకు లావాదేవీల విషయంలో ఎన్నో నిబంధనలు మారుతున్నాయి. బ్యాంకు అకౌంట్లపై ఎక్కువ లావాదేవీలు జరిపే వారిపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రత్యేక నిఘా పెట్టింది. కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువస్తోంది. బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేసే వారు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే. నిబంధనలు పాటించకపోతే పెద్ద ఎత్తున జరిమానాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షలు లేదా ఆపైన మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించినట్లయితే మీపై ట్యాక్స్‌ అధికారులు కన్నేసి ఉంచుతారు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను నియంత్రించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిబంధనల వల్ల పన్ను ఎగవేతను నియంత్రించేందుకు ఉపయోగపడనుంది.

తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఈ నిబంధనలు తీసుకువచ్చింది. ఒక వినియోగదారుడు సంవత్సరంలో రూ.20 లక్షలు డిపాజిట్‌ చేస్తే కచ్చితంగా పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ పాన్‌, ఆధార్‌ అందించకపోతే కేంద్రం భారీగా జరిమానా విధించవచ్చు. పాన్‌ కార్డు లేని వ్యక్తులు రోజుకు రూ.50,000 కంటే ఎక్కువ లేదా ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కంటే ఎక్కువ ఏదైనా లావాదేవీలను జరపడానికి కనీసం ఏడు రోజుల ముందు పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలలో గత కొన్నేళ్లుగా ఆర్థిక మోసాలు, అక్రమ నగదు లావాదేవీల, ఇతర ఆర్థిక మోసాలను తగ్గించేందుకు నిబంధనలను సవరిస్తోంది కేంద్రం. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకుపైగా డిపాజిట్‌ చేసినా.. విత్‌డ్రా చేసినా తప్పకుండా పాన్‌కార్డు కావాల్సింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి