Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విడుదలవుతున్న ‘మార్క్యూ ఎం3 స్మార్ట్’ ఫోన్.. ధర చాలా తక్కువ.. అద్భుత ఫీచర్స్‌..

|

Sep 27, 2021 | 6:04 PM

Flipkart: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో Redmi, Realme బ్రాండ్లు ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలకు పోటీ

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విడుదలవుతున్న మార్క్యూ ఎం3 స్మార్ట్ ఫోన్.. ధర చాలా తక్కువ.. అద్భుత ఫీచర్స్‌..
Marq M3 Smart
Follow us on

Flipkart: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో Redmi, Realme బ్రాండ్లు ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలకు పోటీ ఇవ్వడానికి మరో కంపెనీ సిద్దమైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్క్యూ కంపెనీ ‘మార్క్యూ ఎం3 స్మార్ట్’ని విడుదల చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇంతకు ముందు మార్క్యూ కంపెనీ స్మార్ట్ టీవీలు, స్పీకర్లను విడుదల చేసింది.

మార్క్యూ M3 స్మార్ట్ ఫోన్‌లో 5,000 mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాలు, రివర్స్ ఛార్జింగ్ టెక్ వంటి ఆకర్షించే ఫీచర్లు ఉన్నాయి. 2GB RAM, 32 GB స్టోరేజ్‌ అందిస్తుంది. వెనుక ప్యానెల్‌లో ఆక్టా-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. ఫింగర్ ప్రింట్‌ సౌకర్యం ఇందులో లేదు. 6.088 అంగుళాల డిస్‌ప్లే, రిజల్యూషన్ 720 ×1,560 పిక్సెల్‌లు, స్క్రీన్ రక్షణ కోసం 2.5D క్వార్డ్‌గ్లాస్1.6GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, బొకే లెన్స్ కలిగి ఉంది. ఇది నైట్ మోడ్, బ్యూటీ మోడ్, స్లో మోషన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రెంట్‌ కెమెరా ఇచ్చారు.

ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 9 గంటల పాటు సినిమాను నిరంతరం చూడవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. మార్క్యూ M3 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.7,999. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో దీనిని రూ .6299 కి విక్రయించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5A, ఐటెల్ A26, రియల్‌మే C11 2021, పోకో C3, మైక్రోమాక్స్ ఇన్ 2b వంటి ఇతర బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడనుంది.

Cold Relief: జలుబు నుంచి తక్షణ ఉపశమనానికి ఇలా చేయండి..! గంటలో సాధారణ స్థితికి వస్తారు..

PM-DHM: కార్డులో మీ ఆరోగ్య వివరాలు.. ఒక్క క్లిక్ తో మీ అనారోగ్య చరిత్ర.. పీఏం డిజిటల్ హెల్త్ మిషన్ గురించి తెలుసుకోండి!

Viral Video: వాటర్ స్కీయింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆరేళ్ల చిన్నారి.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో