AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Big Saving Days Sale: ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. వాషింగ్‌ మిషన్‌ నుంచి ఏసీ వరకు అన్ని చౌక..!

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్వర్టర్ AC తక్కువ ధరకు లిస్ట్ చేయబడ్డాయి.

Flipkart Big Saving Days Sale: ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. వాషింగ్‌ మిషన్‌ నుంచి ఏసీ వరకు అన్ని చౌక..!
Flipkart Big Saving Days Sa
uppula Raju
|

Updated on: May 03, 2022 | 10:14 AM

Share

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్వర్టర్ AC తక్కువ ధరకు లిస్ట్ చేయబడ్డాయి. ఈ సేల్‌లో SBI కార్డ్‌తో చెల్లింపు చేస్తే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. వినియోగదారులు తమకు అవసరమైన ప్రతిదాన్ని తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ గురించి చర్చ జరుగుతోంది. దీని ప్రారంభ ధర రూ. 9990గా జాబితా చేశారు. దీనిపై వినియోగదారులు 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు ప్రతి బ్రాండ్‌కు చెందిన వాషింగ్ మెషీన్‌లు ఉన్నాయి. విక్రయ సమయంలో మీరు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

ఎలక్ట్రానిక్స్ వస్తువులపై డిస్కౌంట్లు

ఫ్లిప్‌కార్ట్‌లో జాబితా చేసిన సమాచారం ప్రకారం.. ఎలక్ట్రానిక్స్ వస్తువులపై డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో సౌండ్‌బార్లు, టాబ్లెట్‌లు, మానిటర్లు, DSLR కెమెరాలు, గేమింగ్ కీబోర్డ్‌లు, పవర్ బ్యాంక్‌లు, ట్రిమ్మర్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. అలాగే వీటిపై 90 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

ఏసీపై తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో AC పై కూడా మంచి తగ్గింపు అందుబాటులో ఉంది. 30 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. LG, Samsung వంటి అనేక ACలు ఇందులో ఉన్నాయి.

ఫిలిప్స్ ట్రిమ్మర్ రూ. 999

ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ట్రిమ్మర్‌ను చౌకగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థానిక మార్కెట్లో ట్రిమ్మర్లు ఉన్నప్పటికీ కొన్నిసార్లు పెద్ద బ్రాండ్ల ఉత్పత్తులు అక్కడ కనిపించవు. కానీ ఇక్కడ ఫిలిప్స్ ట్రిమ్మర్ రూ. 999కి జాబితా చేసి ఉంది.

స్మార్ట్ టీవీని చౌక

ఈ సేల్‌లో స్మార్ట్ టీవీని చౌకగా కొనుగోలు చేయవచ్చు. థామ్సన్, రియాలిటీ, రెడ్‌మీ వంటి టీవీలు తగ్గింపు ధరలకి లభిస్తు్న్నాయి. ఎల్‌జి వంటి బ్రాండ్‌ల టీవీలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి

India Post recruitment 2022: నిరుద్యోగులకి శుభవార్త.. పదో తరగతి అర్హతతో 38000 పోస్టులు..

Viral Video: నానమ్మలోకి మైకెల్‌ జాక్సన్ వచ్చాడా ఏంటి.. ఇదేం డ్యాన్స్‌రా బాబోయ్..!

Viral Video: సర్దార్ జీ భల్లే భల్లే.. డ్యాన్స్‌ చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..!