Flipkart Big Billion Days: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్,అమెజాన్, మింత్రా వంటి సైట్ల మధ్య పోటీ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకదానికి మించి ఒకటి పోటీపడి మరీ కస్టమర్లపై ఆఫర్ల వెల్లువ కురిపిస్తున్నాయి. తాజాగా పండుగ సీజన్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్ తేదీలను మార్చింది. అక్టోబర్ 3 – 10 తేదీ మధ్య ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. పండుగ సీజన్‌లో ప్రతీ ఆన్‌లైన్ షాపింగ్ సైట్.. కస్టమర్లను తమవైపు లాగేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగా అన్ని సైట్ల కంటే ముందుగానే.. ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 7-12 మధ్య ఈ సేల్ ఉంటుందని వెల్లడించింది.
అయితే, ఫ్లిప్‌కార్ట్ పోటీదారు అయిన అమెజాన్, మింత్రా వంటి సైట్లు దానికంటే ముందే ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను అక్టోబర్ 4వ తేదీన ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించగా.. మింత్ర అక్టోబర్ 3-10 తేదీల్లో ‘బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ సేల్‌ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దాంతో అలర్ట్ అయిన ఫ్లిప్‌కార్ట్.. ముందుగా ప్రకటించిన తేదీలను మారుస్తూ.. 3-10 మధ్య ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఎనిమిది రోజుల ఈ ఈవెంట్‌లో కస్టమర్లుకు అనేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫ్యాషన్ వేర్, గృహ అవసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై భారీస్థాయిలో డిస్కౌంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా మార్చిన డేట్లను ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్, యాప్‌లో అప్‌డేట్ చేయలేదు. త్వరలోనే ఈ తేదీలను అప్‌డేట్ చేస్తామని సంస్థ ప్రతినిథులు తెలిపారు.
Also read:
Mount Manaslu: ప్రపంచంలోని 8 వ ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన ఐటీబీపీ మౌంటెనీర్లు