AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్..ఎంత పెరిగాయంటే..

దేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంక్ ఎంపిక చేసిన కాల వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను పెంచింది.

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్..ఎంత పెరిగాయంటే..
Fixed Deposits
Follow us
KVD Varma

|

Updated on: Dec 06, 2021 | 8:46 PM

Fixed Deposits: దేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంక్ ఎంపిక చేసిన కాల వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచింది. ఈ రేట్లు డిసెంబర్ 4, 2021 నుంచి వర్తిస్తాయి. ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.50% నుంచి 5.60% వడ్డీ రేటును అందిస్తున్నారు. మరోవైపు, సీనియర్ సిటిజన్లకు 3% నుంచి 6.30% వడ్డీ లభిస్తుంది.

ICICI బ్యాంక్ సాధారణ ప్రజల కోసం (రూ. 2 కోట్ల కంటే తక్కువ) తాజా FD వడ్డీ రెట్లివే.

7 రోజుల నుంచి 14 రోజులు- 15 రోజుల నుంచి 29 రోజులు: 2.50%

30 రోజుల నుంచి 45 రోజులు-46 రోజుల నుంచి 60 రోజులు-61 రోజుల నుంచి 90 రోజులు: 3.00%

91 రోజుల నుంచి 120 రోజులు -121 రోజుల నుంచి150 రోజులు – 151 రోజుల నుంచి184 రోజులు: 3.50%

185 రోజుల నుంచి 210 రోజులు – 211 రోజుల నుంచి 270 రోజులు – 271 రోజుల నుంచి 289 రోజులు – 290 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: 4.40%

1 సంవత్సరం నుంచి 389 రోజులు, 390 రోజుల నుంచి 15 నెలల వరకు, 15 నెలల నుంచి 18 నెలల వరకు: 4.90%

18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: 5.00%

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: 5.20%

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: 5.40%

5 సంవత్సరాలు 1 రోజు నుంచి 10 సంవత్సరాలు: 5.60%

మిగిలిన బ్యాంకులు కూడా..

గత కొద్ది రోజులుగా వివిధ ఆర్థిక సంస్థలు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేట్లను పెంచాయి. హెచ్‌డి‌ఎఫ్‌సి(HDFC) బ్యాంక్ డిసెంబర్ 1, 2021న ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సవరించింది. ఇప్పుడు వారు సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.50% నుంచి 5.50% వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్‌లకు 3% నుంచి 6.25% వడ్డీని అందజేస్తున్నారు.

హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, ఎఎఎ రేటెడ్ కంపెనీలు రెండూ కూడా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డిలు) 0.30 శాతం ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Gaming Experience: స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడటం సరదానా.. మంచి గేమింగ్ అనుభవం కోసం ఎటువంటి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలంటే..

Post Paid Plans: ఎయిర్‌టెల్..వోడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్.. పెరగనున్న ప్లాన్ టారిఫ్‌లు!

Rajnath Singh: రష్యా మంత్రులతో సమావేశంలో చైనా చొరబాట్ల అంశం.. సరిహద్దుల్లో ఆక్రమణలపై కఠినంగా మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్