Government Schemes: మీకు ఆర్థిక భద్రతను కల్పించే ఐదు పథకాలు.. ఎన్నో ప్రయోజనాలు..!

Government Schemes: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆరోగ్య బీమా పాలసీను ప్రవేశపెడుతోంది. ప్రజలకు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న..

Government Schemes: మీకు ఆర్థిక భద్రతను కల్పించే ఐదు పథకాలు.. ఎన్నో ప్రయోజనాలు..!
Follow us

|

Updated on: Sep 06, 2022 | 1:00 PM

Government Schemes: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆరోగ్య బీమా పాలసీను ప్రవేశపెడుతోంది. ప్రజలకు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వారికి ఆరోగ్యం విషయంలో ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరోగ్య బీమా పాలసీను ప్రవేశపెడుతోంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం వచ్చేలా రూపొందిస్తోంది. అలాగే పెన్షన్‌ పథకం లాంటివి కూడా ప్రవేశపెడుతోంది కేంద్రం. ఈ పథకాల వల్ల ప్రజలు ఎన్నో ప్రయోజనాలు అందుకోవచ్చు.

  1. ప్రధాన్‌ మంత్రి జన్‌ధన్‌ యోజన: ఈ స్కీమ్‌ కింద బ్యాంకు ఖాతా తెరిచిన వారికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ అకౌంట్‌లో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఖాతాదారులు రూపే డెబిట్‌ కార్డు కూడా పొందవచ్చు. ఖాతాదారులు రూపే కార్డుతో రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ10,000 వరకు ఓవర్‌ డ్రాప్ట్‌ సౌకర్యం పొందవచ్చు. వీరు వివిధ పథకాలకు అర్హులు.
  2. ఆరోగ్య బీమా: ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో ఆరోగ్య బీమాలు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. మీరు ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన లేదా ఆయుష్మాన్‌ భారత్‌ నుంచి ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. గతంలో రూ.30 వార్షిక ప్రీమియంతో కుటుంబానికి రూ.5 లక్షల వరకు కవరేజీని అందుకోవచ్చు. ప్రధానంగా దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
  3. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన: ఈ స్కీమ్‌ తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయి. 18-70 సంవత్సరాలు గల వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ పథకంలో రూ.2 లక్షలు ప్రమాదవశౄత్తు మరణం, పూర్తి వైక్యలం వంటి కవరేజీని అందుకోవచ్చు. జూన్‌ 1 నుంచి మే 31 మధ్య ఈ స్కీమ్‌లో చేరాలి. ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియం ఖాతాదారుని బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ అవుతాయి. ఈ పథకాన్ని ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు, సారూప్య నిబంధనలపై అందించే ఇతర సాధారణ బీమా సంస్థలు అందిస్తున్నాయి.
  4. జీవన్‌ జ్యోతి బీమా యోజన: ఈ పథకంలో చేరేందుకు 18-50 సంవత్సరాలున్నవారు చేరవచ్చు. ఈ స్కీమ్‌ ద్వారా రూ.2 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ ఉంటుంది. వార్షిక ప్రీమియం రూ.436. ప్రతి ఏడాది బ్యాంకు ఖాతా నుంచి ఆటోడెబిట్‌ అవుతాయి. ఈ పథకాన్ని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, ఇతర జీవిత బీమా సంస్థలు అందిస్తున్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. అటల్‌ పెన్షన్‌ యోజన స్కీమ్‌: ఈ పథకంలో 60 సంవత్సరాల తర్వాత పెన్షన్‌ను అందుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరేందుకు 18-40 సంవత్సరాలున్నవారు సేవింగ్‌, పోస్టాఫీసు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలు తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి రూ.1000 నుంచి రూ.5000 వరకు నెల వారీ పెన్షన్‌ అందుకోవచ్చు. అయితే ఈ పథకంలో చేరిన వారికి వయసును బట్టి ప్రీమియం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి